గురకను తగ్గించే తలగడ గురించి మీకు తెలుసా?

గురక రావడం ప్రస్తుత రోజుల్లో పెద్ద సమస్యగా మారింది.ఈ గురక పెట్టడం వల్ల సమస్య ఉన్న వారి కంటే పక్కన నిద్రపోయే వారికి అతి పెద్ద సమస్యగా మారుతుంది.

 Amazing Pillow Stops Snoring In Any Sleeping Position, Anti Snore Pillow, Sleeping Position, Matrix Pillow Price And Details, Anti Snore Pillow Details-TeluguStop.com

ఈ సమస్య వల్ల ప్రతిరోజు నిద్ర లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.అయితే గురక పెట్టడం వంటి సమస్యతో బాధపడేవారికి ఓ ప్రముఖ సంస్థ ఒక శుభవార్తను చెప్పింది.

తమ సంస్థ తయారు చేసే తలగడను వాడటం ద్వారా ఈ గురక సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని తెలియజేసింది.

 Amazing Pillow Stops Snoring In Any Sleeping Position, Anti Snore Pillow, Sleeping Position, Matrix Pillow Price And Details, Anti Snore Pillow Details-గురకను తగ్గించే తలగడ గురించి మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా కొంతమందికి తలగడ అలవాటు లేకపోవడంతో ఫ్లాట్ గా పడుకొని ఉండటం వల్ల ముక్కులోని శ్వాసకోశ రంధ్రాలు పూర్తిగా మూసుకు పోవడంతో ఈ గురక అనేది వస్తుంది.

అలాంటి వారి కోసమే ఈ‘మ్యాట్రిక్స్ పిల్లో’ రూపొందించామని, ఆ సంస్థ తెలియజేసింది.ఈ తలగడ తయారు చేసేటప్పుడు ఇందులో రెండు లేయర్ల మిశ్రమంతో పాటు, మరింత సౌకర్యంగా ఉండేందుకు మెమొరీ ఫోమ్ ఉపయోగించినట్లు ఈ సంస్థ పేర్కొంది.

అంతేకాకుండా ఈ ప్రత్యేకమైన తలగడలో 14 క్యూబ్ లను ఉపయోగించి తయారు చేయటం వల్ల ఎటువైపు తిరిగి పడుకున్నా ఎంతో సౌకర్యవంతంగా ఉండటం వల్ల గురుక వచ్చే సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తుందని మ్యాట్రిక్స్ పిల్లో సంస్థ పేర్కొంది.అంతేకాకుండా ఈ తలగడను ఉపయోగించడం ద్వారా హాయిగా నిద్ర పట్టడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసి మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఈ సంస్థ పేర్కొంది.ప్రస్తుతం ఈ తలగడలు కేవలం యూకే లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఇంతటి ప్రత్యేకమైన ఈ పిల్లో ధర 59 పౌండ్లు, అంటే భారతదేశ కరెన్సీలో దాదాపు రూ.5821.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube