వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధన... ఆందోళనలతో అట్టుడుకుతోన్న కెనడా: ఆర్మీని దించే యోచనలో ట్రూడో..?

అమెరికా- కెనడాల మధ్య వస్తువులను రవాణా చేసే ట్రక్కు డ్రైవర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్న కెనడా సర్కార్ నిర్ణయం ఉద్రిక్తతలకు కారణమైన సంగతి తెలిసిందే.ట్రూడో సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ర్యాలీగా రాజధాని ఒట్టావాకు బయలుదేరారు.

 Anti-mandate Protest In Canada: Trudeau Govt May Call In Armed Forces To Break T-TeluguStop.com

దీంతో నగరానికి వచ్చే రహదారులన్నీ ట్రక్కులతో కిక్కిరిసిపోయిన సంగతి తెలిసిందే.ఈ ట్రక్కులన్నీ రాజధానిలోకి ప్రవేశిస్తే .హింస చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.దీంతో ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు పోలీసులు.

ఈ నేపథ్యంలోనే భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించాయి.

మరోవైపు ఆందోళనకారులు రాజధాని నగరంలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు పార్లమెంట్‌ హిల్‌ ప్రాంతంలో రాకపోకలకు తీవ్రం అంతరాయం కలిగిస్తున్నారు.

కొందరు జాతీయ అమరవీరుల స్మారకాన్ని అవమానించడం, సైనికుల సమాధులపై డ్యాన్సులు చేయడం వంటి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు.ఇంకొందరు నాజీల స్వస్తిక్‌ గుర్తున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

వీరికి దేశ ప్రజల నుంచి పెద్దగా సానుభూతి లభించడం లేదు.కాకపోతే టీకాకు వ్యతిరేకంగా వున్న ఒక వర్గం మాత్రం మద్ధతుగా నిలబడుతున్నట్లుగా తెలుస్తోంది.

తొలుత టీకా తప్పనిసరి నిబంధనలు ఎత్తివేస్తే చాలన్న నిరసనకారులు.తాజాగా తమ నిరసన ఇంతటితో ఆగదని, ట్రూడో రాజీనామా చేయాలని కొత్త పల్లవి అందుకున్నారు.

కోవిడ్‌ నిబంధనల్లో చాలావాటిని ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలు విధించినా నిరసనకారులు మాత్రం ట్రూడోను టార్గెట్‌ చేస్తుండటం గమనార్హం.

ఇప్పటికే ఆందోళనకారుల నిరసన చట్టవిరుద్ధంగా మారుతోందని ప్రధాని వ్యాఖ్యానించిన నేపథ్యంలో.నిరసనలను అదుపు చేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది.అటు ట్రక్కర్ల ఆందోళన కోసం GoFundMe ద్వారా 10 మిలియన్ల కెనడియన్ డాలర్లను సేకరించింది.

అయితే ఈ నిధులను సదరు సంస్థ హోల్డ్‌లో వుంచింది.

Anti-mandate Protest In Canada: Trudeau Govt May Call In Armed Forces To Break The Impasse, Prime Minister Justin Trudeau , America- Canada, Government Of Canada, GoFundMe - Telugu America Canada, Canadatrudeau, Gofundme, Canada, Primejustin

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube