వైరల్: లో దుస్తులతో నిరసన చేస్తున్న ప్రజలు.. అసలు మ్యాటరేంటంటే..?!

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొదటిసారి వచ్చిన దాని కంటే రెండవ సారి వచ్చిన కరోనా అతి తీవ్రంగా ఉండడంతో పాటు అతి తక్కువ సమయంలోనే కొన్ని లక్షల కేసులు నమోదు ఉండడంతో ప్రపంచంలోని ప్రజలు పెద్దఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారు.

 Anti Lockdown Protests Continue Across Italy Corona Cases-TeluguStop.com

కొన్ని దేశాల్లో ఇప్పటికే మరోమారు లాక్ డౌన్ విధించి పెద్ద ఎత్తున ఆంక్షలను కొనసాగిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉండగా.

యూరప్ లోనీ అనేక దేశాలలో కేసులు రోజు రోజుకి అమాంతం పెరుగుతుండడంతో ఇటలీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ ఆంక్షలు విధించారు.కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాలను రెడ్ జోన్ లు గా ప్రకటించి వారికి పూర్తి లాక్ గౌడ్ ను విధించారు.

 Anti Lockdown Protests Continue Across Italy Corona Cases-వైరల్: లో దుస్తులతో నిరసన చేస్తున్న ప్రజలు.. అసలు మ్యాటరేంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆ ప్రాంతంలోని షాపులు అలాగే మాల్స్ లాంటివి పూర్తిగా మూతపడి పోయాయి.దీంతో చిన్న వ్యాపారం నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు లాక్ డౌన్ కారణం చేత పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు.

అయితే ప్రభుత్వం మొదటగా ప్రకటించిన ప్రకారం గత వారమే పూర్తి కావాల్సిన లాక్‌డౌన్‌ కేసులు తగ్గకపోవడంతో మరో వారం పాటు పొడిగించింది.దీంతో మరోమారు దుకాణాలు మూసివేయించిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో ఆగ్రహం పట్టలేని ప్రజలు ఇక నష్టం భరించే శక్తి తమతో లేదంటూ ప్రభుత్వంపై ఎదురు తిరిగారు.లాక్ డౌన్ తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఇటలీలోని చియాయ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్ సముదాయంలో అనేక మంది షాపుల యజమానులు మానవహారంగా మరి పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు వాడే లోదుస్తులు అయిన బ్రాలు, డ్రాయర్లు ప్రదర్శిస్తూ పెద్దఎత్తున ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

ఈ సందర్భంగా వారు లాక్ డౌన్ నియమాలని ఎత్తివేయాలని ఇకపై తాము షాపులకు అద్దెలు, ఇతరత్రా బిల్లులు చెల్లించలేమని ప్రభుత్వానికి వారి విన్నపాన్ని తెలియజేశారు.

#Coronavirus #Lock Down #Inner Wears #Protest #Italy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు