చైనాకు పాకిస్తానీయుల షాక్: వందేమాతరం, జనగణమణ ఆలపిస్తూ… భారతీయులతో కలిసి నిరసనలు  

Pakistanis Sing ‘Jana Gana Mana’ & ‘Vande Mataram’ With Indians in London During Anti-China Protest,Pakistanis , Anti-China Protest,Vande Mataram - Telugu Anti-china Protest, Pakistanis, Pakistanis Sing ‘jana Gana Mana’ & ‘vande Mataram’ With Indians In London During Anti-china Protest, Vande Mataram

భారతదేశమన్నా.భారతీయులన్నా నిలువెల్లా ద్వేషంతో రగిలిపోతారు పాకిస్తానీయులు.

 Anti China Protest Pakistanis Indians

మనల్ని డైరెక్ట్‌గా గెలిచే సత్తా లేక దొంగ దెబ్బ తీస్తూ.భారతదేశంలో అలజడి రేపాలని ప్రతినిత్యం ప్రయత్నిస్తుంటాయి అక్కడి ఉగ్రవాద సంస్ధలు.

అలాంటి పాకిస్తానీయులు మనదేశ జాతీయ గీతం, వందేమాతరం ఆలపిస్తూ భారతీయులతో కలిసి నిరసనకు దిగారు.అస్సలు నమ్మశక్యంకానీ ఈ ఉదంతం లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం వద్ద జరిగింది.

చైనాకు పాకిస్తానీయుల షాక్: వందేమాతరం, జనగణమణ ఆలపిస్తూ… భారతీయులతో కలిసి నిరసనలు-Telugu NRI-Telugu Tollywood Photo Image

చైనా విస్తరణవాదంతో విసిగిపోయిన కొందరు పాకిస్తాన్‌‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్తలు భారతీయులతో కలిసి నిరసన దీక్షకు దిగారు.పాకిస్తానీయులు సైతం భారతీయులతో కలిసి జనగణమన, వందేమాతరం గీతాలను ఆలపిస్తూ చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దీంతో ఆ ప్రాంతమంతా ‘ బాయ్ కాట్ చైనా ’’ నినాదాలతో హోరెత్తిపోయింది.పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు జైకొట్టడాన్ని మానుకోవాలని ఆ దేశానికి చెందిన సామాజిక కార్యకర్త ఆరిఫ్ అజాకియా అన్నారు.

తాను జీవితంలో తొలిసారి వందేమాతరం పాడానని తెలిపారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ వాసులు, మరికొంతమంది కరాచీకి చెందినవారు, ఇంకొందరు ఇరాన్ ప్రజలు కూడా చైనా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.తమ దేశ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు.చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ పేరుతో గిల్గిత్- బాల్టిస్టాన్ మధ్య చిచ్చు పెడుతోందని వారు ఆరోపించారు.

మరోవైపు దాయాది దేశానికి పాకిస్తానీయులు అండగా నిలబడటం అనేక మందిని ఆకట్టుకుంటోంది.కాగా చైనా తీరును తప్పుబడుతూ.అమెరికా, కెనడా సహా చాలా దేశాల్లో భారతీయులు ఆందోళన వ్యక్తం తెలిసిందే.చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా, చైనా దురాక్రమణ విధానాన్ని నిరసిస్తూ… ‘‘ ఫ్రీ టిబెట్, ఫ్రీ హాంకాంగ్, ఫ్రీ ఉయ్‌ఘర్స్’’ అనే ఫోటో ఒకటి శనివారం రాత్రి అక్కడ చైనా రాయబార కార్యాలయంపై వేలాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది.

#Vande Mataram #Pakistanis

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anti China Protest Pakistanis Indians Related Telugu News,Photos/Pics,Images..