పండ్ల వ్యర్థాల నుంచి గాయం మానడానికి యాంటీబ్యాక్టీరియల్ బ్యాండ్స్ రెడీ..!

మనకు ఎక్కడన్నా గాయం తగిలినప్పుడు ఆ గాయం త్వరగా తగ్గిపోవడానికి బ్యాండేజ్ ను వేసుకుంటాము కదా.అయితే బ్యాండేజ్ లలో చాలా రకాల అయిన బ్యాండేజ్ లను మనం చూసే ఉంటాము.

 Anti Bacterial Bands For Injuries From Fruits Wastages Are Ready, Fruits Waste,-TeluguStop.com

కానీ మీరు ఎప్పుడన్నా పండ్ల వ్యర్థాల నుండి తయారు చేసిన యాంటీ బాక్టీరియల్ బ్యాండేజ్‌ గురించి విన్నారా.? వినలేదు కదా.అయితే ఇప్పుడు సింగపూర్‌ లోని శాస్త్రవేత్తలు పండ్ల వ్యర్దాలతో యాంటీ బాక్టీరియల్ బ్యాండేజ్ ను తయారు చేసారు.ఈ బ్యాండేజ్ వలన పండు కూడా వృధా కాదు.

అలాగే మనకు తగిలిన గాయం కూడా త్వరగా నయం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.అసలు ఈ బ్యాండేజ్ ఏ పండు యొక్క వ్యర్ధాలతో తయారు చేస్తారో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సింగపూర్‌ లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.ఈ బ్యాండేజ్ ను దురియాన్ పండు అవశేషాల నుండి తయారు చేసినట్లు తెలుస్తుంది.పరిశోధకుడు ప్రొ.విలియం చెన్ చెబుతున్న దాని ప్రకారం.

, సింగపూర్ ప్రజలు ప్రతి ఏటా 125 మిలియన్ డూరియన్ పండ్లను తింటారు.ఈ పండు చూడడానికి జాక్ ఫ్రూట్ లాగా కనిపిస్తుంది.

అయితే అక్కడి ప్రజలు కేవలం ఈ పండులోని గుజ్జును మాత్రమే తిని దాని పై ఉన్న తొక్క, విత్తనాలను పారవేస్తారు.ఫలితంగా ఇవి పర్యావరణం పై ప్రభావాన్ని చూపుతున్నాయి.

అందుకే ఈ పండు యొక్క వ్యర్ధాలతో కొత్త బ్యాండేజ్ ను తయారు చేయడం ద్వారా పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు అనే ఆలోచనతో ఇలా బ్యాండేజ్ ను తయారుచేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

Telugu Bacterial, Bacterial Bands, Bands, Fruits Wastages, Fruits Waste, Benifit

అసలు ఈ బ్యాండేజ్ ను ఎలా తయారుచేస్తారంటే ముందుగా దురియన్ పండు నుంచి వేరు చేసి దానిని గ్రైండింగ్ చేయడం వలన సెల్యులోజ్ అనే పౌడర్ తయారు అవుతుందట.ఆ తర్వాత ఈ పొడిలో గ్లిసరాల్‌ ని కలిపి దానిని యాంటీ బాక్టీరియల్ స్ట్రిప్స్‌ గా మార్చారు.అలా వీటిని సన్నని స్ట్రిప్స్‌గా కట్ చేసి పట్టీలుగా తయారు చేశారు.

కాగా ఇవి ఇతర పట్టీల కన్నా సౌకర్యవంతంగా ఉంటాయట.అంతేకాకుండా ఈ పట్టీలు గాయాన్ని చల్లగా, తేమగా ఉంచడం వలన గాయం త్వరగా నయమవుతుంది.

ఇలా పండ్ల వ్యర్థాల నుండి పట్టీలను తయారు చేయడం అనేది ఇతర పట్టీల కంటే చాలా తక్కువ ఖర్చుతో కూడిన పని అంటూ పరిశోధకులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube