అప్రమత్తంగా ఉండండి అమెరికన్స్ కు ఆంటోని ఫౌచీ హెచ్చరిక..!!!

అమెరికాపై కరోనా పగ పట్టిందా అన్నట్టుగా, కొత్త వేరియంట్లు అన్నీ అమెరికాపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి.ప్రపంచంలో ఎక్కడ కొత్త వేరియంట్ వచ్చిపడినా వాటి ప్రభావం మాత్రం అమెరికాపై నే అత్యధికంగా కనిపిస్తోంది.

 Anthony Fouchi Warns Americans To Be Vigilant , Anthony Fouchi, Americans, Omecr-TeluguStop.com

తాజాగా కొత్త వేరియంట్ ఒమెక్రాన్ కేసులు సైతం అమెరికా, బ్రిటన్ దేశాలలో అత్యధికంగా నమోదు అవడం అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.అమెరికాలో ఒక్క రోజులో లక్షకు పైగా కేసులు నమోదు కావడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే కరోనా కొత్త వేరియంట్స్ వచ్చి పడుతున్నా సరే అమెరికన్స్ లో ఎలాంటి మార్పు లేదని, మాస్క్ లు లేకుండా , వ్యాక్సిన్ చేయించుకోకుండా ఎదేశ్చగా తిరుగుతున్నారని, కొందరు మండిపడుతున్నారు.మరో పక్క రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు, అలాగే బూస్టర్ డోస్ కూడా పూర్తి చేసుకున్న వారు తమకేం కాదంటూ స్వేచ్చగా తిరిగేయడం, మాస్క్ లు తీసేసి దైనందిక కార్యక్రమాలలో పాల్గొనడంతో ఈ ఘటనలపై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ తీవ్రంగా స్పందించారు.

ప్రస్తుత కొత్త వేరియంట్ ఒమెక్రాన్ కేసులు అమెరికా వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఈ వేరియంట్ ప్రభావం ఇప్పటికిప్పుడు ఎలాంటి నష్టాన్ని కలిగించకపోయినా భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో చెప్పలేమని, వ్యాక్సిన్ వేసుకున్నామనో, లేదా బూస్టర్ డోస్ వేసుకున్నామనో బయట ఎదేశ్చగా తిరగవద్దని ఫౌచీ హెచ్చరించారు.బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా ఒమెక్రాన్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రమాదమేనని, భవిష్యత్తులో మరిన్ని వైరస్ లు రానున్నాయని, ప్రతీ ఒక్కరూ జాగ్రత్త వహించాలనీ ఫౌచీ సూచించారు.పిల్లలపై ఈ మహమ్మారి ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తల్లి తండ్రులు జాగ్రత్తలు వహించడమే కాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube