ఆంటోని ఫౌచీ సంచలన వ్యాఖ్యలు...అమెరికాకు “డెల్టా” అతిపెద్ద సవాల్...!!!

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన ఆందోళన నేటికి అలానే కొనసాగుతోంది.మధ్య మధ్యలో రెండు మూడు నెలల విరామం తీసుకుని కొత్త రూపంలో ముంచుకొస్తున్న మహమ్మారిని ఎదుర్కునేందుకు పరిశోధకులు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

 Anthony Fauci Sensational Comments On Delta Variant In Us, Us, Covid-19, Anthony-TeluguStop.com

అమెరికాలో కరోనా మొదటి వేవ్ సృష్టించిన అలజడితో వణికిపోయిన అమెరికన్స్, సెకండ్ వేవ్ లో వ్యాక్సిన్ లతో ప్రభావాన్ని తగ్గించేశారు.కానీ భారత్ లో వచ్చిన డెల్టా వేరియంట్ ప్రస్తుతం అమెరికాలో కొత్త రూపు దాల్చుకుని విరుచుకు పడటానికి సిద్దంగా ఉందని అమెరికన్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రస్తుతానికి అమెరికాకు ఈ వేరియంట్ అతి పెద్ద సవాల్ గా మారిందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్.

ఆంటోని ఫౌచీ సంచలన ప్రకటన చేశారు.


మాస్క్ రహిత దేశంగా తమను ప్రకటించుకున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ఫౌచీ వ్యాఖ్యలతో ఖంగు తిన్నదనే చెప్పాలి.

డెల్టా వేరియంట్ ప్లస్ గా అమెరికాలో విస్తరిస్తున్న మహమ్మారి.ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలకు విస్తరించగా అన్ని దేశాలు భారీ మూల్యం చేల్లిన్చుకుంటున్న నేపధ్యంలో ఫౌచీ వ్యాఖ్యలు మరింత కలవర పెడుతున్నాయి.

అమెరికా నుంచీ కరోనా ను తరిమికొట్టాలని అనుకున్న తమకు ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ పెను సవాలుగా మారిందని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో వచ్చిన వేరియంట్ల తో పోల్చితే డెల్టా వేరియంట్ చాలా తీవ్రంగా ఉందని, దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం ప్రభుత్వాలకు అతిపెద్ద సవాల్ అంటున్నారు.

అమెరికాలో ప్రస్తుతం ఉన్న మొత్తం పాజిటివ్ కేసుల్లో 20 శాతం పైగా డెల్టా వేరియంట్ కు చెందినవేనని వారం క్రితం వరకూ కూడా డెల్టా కేసుల సంఖ్య కేవలం 10 శాతం ఉందని కానీ ఊహించని రీతిలో 10 శాతం పైగా పెరిగిపోవడం ఒకింత ఆందోళన కలిగించే అంశమేనని అయితే గతంలో మాదిరిగా సమర్ధవంతంగా ఈ మహమ్మారి ని కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ఫౌచీ ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube