భారత కో వాగ్జిన్ పై అమెరికా అధ్యయనం అద్భుతం అంటున్న ఆంటోని ఫౌచీ..!!!

భారత్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో భారత బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కో వాగ్జిన్ పై అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది.భారత బయోటెక్ కంపెనీ చేస్తున్న ఈ వ్యాక్సిన్ చాలా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చింది.

 Covaxin Found To Neutralize 617 Variant Of Covid-19 Says Fauci , Covaxin,  Covid-TeluguStop.com

ఈ మేరకు ఆంటోని పౌచీ మీడియా సమావేశంలో మాట్లాడారు.ప్రస్తుతం భారత్ లో కరోనా విస్తరిస్తూ వేలాది కేసులు నమోదు, మృతుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఆంటోని ఫౌచీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వివరాలలోకి వెళ్తే.

అమెరికా అధ్యక్షుడికి వైద్య విభాగ సలహారుగా ఉన్న అమెరికా అంటువ్యాధుల నిర్మూలన నిపుణుడు, కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంతో కీలక మాత్ర పోషించిన డాక్టర్ .ఆంటోని ఫౌచీ భారత్ ప్రస్తుతం ఎదుర్కుంటున్న రెండో వేరియంట్ ను సమర్ధవంతగా తిప్పి కొట్టడంలో భారత కో వ్యాగ్జిన్ చాలా చక్కగా పనిచేస్తుందని అన్నారు.దేశంలో రెండు సార్లు జన్యు మార్పిడి చేసుకుని వచ్చిన ఈ మహమ్మారిని కట్టడి చేయగల శక్తి దీనికి ఉందని అన్నారు.ఈ వ్యాగ్జిన్ పై తాము అధ్యయనం చేసామని ఈ వ్యాగ్జిన్ తీసుకున్న వారిని పరిశీలిస్తే వారిలో బి.1.617 వైరస్ ను తట్టుకునే యాంటీ బాడీలు ఎంతో సమర్ధవంతా అభివృద్ధి చెందాయని అన్నారు.

భారత్ లో సెకండ్ వేవ్ కు అడ్డు కట్ట వేయాలంటే తప్పకుండా ప్రతీ ఒక్కరూ కో వ్యాగ్జిన్ వేసుకోవాలని కోరారు.

ఇదిలాఉంటే హైదరాబాద్ కు చెందిన భారత బయోటెక్ సంస్థ లాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ రెండూ కలిసి ఈ టీకా ను అభివృద్ధి చేశాయి.ఈ వ్యాగ్జిన్ 78% సమర్ధవంతా కరోనా వైరస్ ను ఎదుర్కుంటుందని అలాగే సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవీ షీల్డ్ కూడా బాగా పనిచేస్తుందని ఐజిఐబీ సంస్థ డైరక్టర్ అనురాగ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదిలాఉంటే భారత్ లో వచ్చిన డబుల్ వేరియంట్ దాదాపు 17 దేశాలకు విస్తరించినట్టుగా తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube