అంటే సుందరానికి మొదలయ్యేది అప్పుడే!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.చాలా రోజుల తరువాత నాని ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Ante Sundaraniki To Kick Start From May, Ante Sundaraniki, Nani, Nazriya, Tollyw-TeluguStop.com

ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించడంతో ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో సైతం ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌లు ఈ అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇక ఈ సినిమా తరువాత నాని తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇప్పటికే శ్యామ్ సింఘ రాయ్ అనే సినిమాలో నాని సరికొత్త లుక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ మూవీ ‘అంటే సుందరానికి’ని అనౌన్స్ చేశాడు.కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్‌ను మే నెలలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి నాని వరుసగా సినిమాలు చేస్తూ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.మరి నాని నటిస్తున్న టక్ జగదీష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఏప్రిల్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube