‘అంతరిక్షం’ బడ్జెట్‌, బిజినెస్‌, కలెక్షన్స్‌... నోరు వెళ్లబెట్టడం ఖాయం

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, ఘాజీ చిత్ర దర్శకుడు సంకల్ప్‌ రెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన ‘అంతరిక్షం’ చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చారు.ఘాజీ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా తప్పకుండా అంతరిక్షం మూవీ కూడా అద్బుతంగా ఉంటుందని కొందరు భావించారు.

 Antariksham Movie Budget And Total Collections-TeluguStop.com

అందుకు సంబంధించిన ట్రైలర్‌ కూడా అంచనాలు పెంచేసింది.సినిమాపై అంచనాలు అమాంతం పెంచడంతో పాటు, అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి అమ్మేశారు.

దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించాడు.

సినిమాకు వచ్చిన క్రేజ్‌ నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కలిసి ఈ చిత్రం కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారానే ఏకంగా 21 కోట్లకు అమ్ముడు పోయింది.నిర్మాతలకు టేబుల్‌ ఫ్రాఫిట్‌ అయితే దక్కింది.కాని డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నిండా మునిగారు.

మొదటి రెండు రోజుల్లో ఈజీగా 10 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం క్రాస్‌ చేస్తుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా లాంగ్‌ రన్‌లో కూడా ఈ చిత్రం ఆ మార్క్‌ను క్రాస్‌ చేయలేక పోయింది.

మొదటి రోజు నుండే ఈ సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చిన కారణంగా సినిమాకు దారుణమైన కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి.మొదటి రోజు అయిదు ఆరు కోట్ల ఓపెనింగ్స్‌ దక్కడం ఖాయం అన్నట్లుగా చెప్పుకొచ్చారు.

కాని తీరా పరిస్థితి చూస్తే మొదటి వారం మొత్తం కూడా కనీసం అయిదు కోట్లను రాబట్టలేక పోయింది.లాంగన్‌ రన్‌ లో ఈ చిత్రం అయిదున్నర కోట్ల వద్ద ముగియబోతుంది.

అంటే ఈ చిత్రం ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 15 కోట్లకు పైగా నష్టం అన్నమాట.ఈ నష్టాలను నిర్మాతలు ఏమైనా భరిస్తారేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు