ఆ ఊరు వారందరు కూడా ముందస్తుగా ఆ ఆపరేషన్‌ చేయించుకున్నారు.. అక్కడకు ఎవరు వెళ్లినా చేయించుకోవాల్సిందే

ప్రపంచంలో కొన్ని గ్రామాలు ఇంకా సాదారణ జన జీవనానికి చాలా దూరంలో ఉంటున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కంప్యూటర్‌ యుగంలో కూడా కొన్ని ప్రదేశాల్లో కనీసం టెలీ కమ్యూనికేషన్‌ వ్యవస్థ లేకుండా ఉంటుంది.

 Antarctica Town Villas Las Estrellas With Mandatory Appendectomy-TeluguStop.com

ఇక అంటార్కిటిక ఖండంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి.అందులో ఒక గ్రామమే విల్లాస్‌ లాస్‌ ఎస్ట్రెలాస్‌.

ఆ ఊరిలో కనీస అవసరాలు కూడా లభించడం కష్టం.ఏదైనా చిన్న అవసరం వచ్చినా కూడా విలవిలలాడాల్సిందే.

ఇక పెద్ద హాస్పిటల్‌కు వెళ్లాలి అంటే కనీసం వెయ్యి కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి ఉంటుంది.

ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా అపెండెక్స్‌ ఆపరేషన్‌ చేయించుకుని ఉంటారు.

ఎందుకంటే పొరపాటున ఎవరికైనా అపెండెక్స్‌ కడుపు నొప్పి వస్తే చావు తప్ప మరోటి ఉండదు.అందుకే అక్కడి వారు అంతా కూడా ముందుగానే అపెండెక్స్‌ ఆపరేషన్‌ చేయించుకుని ఉంటారు.

ప్రతి ఒక్కరు కూడా అపెండెక్స్‌ ఆపరేషన్‌ చేయించుకోవడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం లేకపోవడంతో పాటు, ఆపరేషన్‌ సమస్య ఉండదు.కడుపు నొప్పి వల్లగతంలో కొందరు ఇబ్బంది పడి చనిపోయారు.

ఆ కారణం వల్లే గ్రామంలోని అంతా కూడా ఆపరేషన్‌ చేయించుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.

గ్రామం నుండి హాస్పిటల్‌కు వెయ్యి కిలోమీటర్లు ఉండటంతో పాటు, మంచు దుప్పటి కప్పి ఉన్న రోడ్లపై ప్రయాణించాల్సి ఉంటుంది.అందుకే చావు అంచున ఉన్న సమయంలోనే ఆ ప్రయాణం పెట్టుకుంటారు.అలాంటి ప్రయాణాలు అక్కడ చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.

వెయ్యి కిలోమీటర్లు మంచులో ప్రయాణం అంటే రెండు నుండి మూడు రోజులు కొన్ని సార్లు అయిదు రోజులు కూడా పడుతుందట.అలాంటి సమయంలో అపెండెక్స్‌ నొప్పిని భరించడం కష్టం.

అందుకే ముందస్తుగానే అపెండెక్స్‌ ఆపరేషన్స్‌ చేయించుకుంటారు.ఎవరైన అక్కడ సెటిల్‌ అవ్వాలనుకునే వారు ఆ ఆపరేషన్‌ను చేయించుకుని అక్కడకు వెళ్తారట.

ఇలాంటి విచిత్రమైన ఊరు ఒకటి ఉందంటే నమ్మశక్యంగా లేదు కదా…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube