తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు పొందిన అక్కినేని నాగేశ్వర రావు గురించి ఎంత చెప్పిన తక్కువే.ఎన్నో సినిమాలలో నటించి మంచి నటుడిగా నిలిచిన ఈయన.
ఈ తరం ప్రేక్షకులకు కూడా మంచి అభిమాన నటుడిగా నిలిచారు.కేవలం తానే కాకుండా తన వారసులను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి ఒక గుర్తింపును అందించాడు.
ఇదిలా ఉంటే ఈయన టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా పై చివరి రోజుల్లో ఓ రొమాంటిక్ కామెంట్ చేశాడు.
టాలీవుడ్ లో మిల్క్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న తమన్నా గురించి అందరికి తెలిసిందే.
తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.తన అందంతో మాత్రం యువతను బాగా ఫిదా చేసింది.
అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.ఇక ఈ అమ్మడు సరసన నటించడానికి స్టార్ హీరోలు బాగా ఆశపడుతుంటారు.
యంగ్ స్టార్ హీరోల నుండి పెద్ద స్టార్ హీరోల వరకు వారి సరసన నటించింది తమన్నా.తొలిసారిగా 2005లో శ్రీ అనే సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
కానీ ఈ సినిమా తర్వాత నటించిన హ్యాపీ డేస్ సినిమాతో మాత్రం మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
ఇప్పటికీ తన ఖాతాలో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి.
టాలీవుడ్ లోనే కాకుండా హిందీ, తమిళ భాషలలో కూడా అవకాశాలు అందుకుంది.అక్కడ కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే గతంలో ఏఎన్ఆర్ తన చివరి రోజుల్లో తమన్నా అందాన్ని చూసి ఫిదా అయ్యి ఏకంగా తమన్నాపై రొమాంటిక్ కామెంట్స్ చేశాడు.
తమన్నా.
అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి 100% లవ్, తడాఖా వంటి సినిమాలలో నటించింది.ఇక తడాఖా సినిమాలో సునీల్ కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఇక గతంలో తడాఖా సినిమా విడుదలకు ముందు ఆడియో ఫంక్షన్ వేడుక ఘనంగా జరిగింది.అందులో అక్కినేని నాగేశ్వరరావు తో పాటు తన వారసులు, సినీ బృందం పాల్గొని ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.
ఇక అక్కినేని నాగేశ్వరరావు కూడా ఈ వేడుకలో పాల్గొని నాగ చైతన్య, సునీల్, తమన్నా గురించి కొన్ని విషయాలు తెలిపాడు.ఇక తమన్నాను తన వయసు గురించి అడగగా ఆమె 23 అని చెప్పింది.వెంటనే ఏఎన్ఆర్ ఈమె 32 వయసు అయితే మాత్రం అసలు చెప్పదు 23 కాబట్టి చెబుతుందని సరదా కామెంట్ చేశాడు.
ఇక తమన్నాను చూశాక తన వయసు మొత్తం నల్లపడిపోయింది అంటూ జుట్టు పోయింది అంటూ తన తలపై చేయి పెట్టుకొని చూపించేసరికి అందరూ నవ్వుతూ ఉండగా తమన్నా మాత్రం బాగా మురిసిపోతుంది.అయినా కూడా తమన్నాను చూడగానే తన వయసు 25 ల అనిపిస్తుంది అంటూ రొమాంటిక్ కామెంట్ చేశాడు.ఈ అమ్మాయితో నటించే ఛాన్స్ నా మనవడికి దొరికింది కానీ నాకెందుకు దొరకలేదా అని అనిపిస్తుందని తెలిపాడు.
గతంలో నాగేశ్వరరావు కూడా తమన్నా అందాలు చూసి ఫిదా అయ్యాడు.