సెల్ఫీ కి మరో యువతి బలి  

Another Women Die For Selfie-die,general Updates,selfie,women,యువతి

సెల్ఫీ పిచ్చి మరో యువతి బలైపోయింది. ఏపీ లోని కృష్ణా జిల్లా కు చెందిన ఒక వైద్యురాలు సెల్ఫీ తీసుకోబోతూ ప్రమాదవశాత్తు కెరటాలకు కొట్టుకొని పోయింది. ఈ ఘటన గోవా లో మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

సెల్ఫీ కి మరో యువతి బలి-Another Women Die For Selfie

వివరాల్లోకీ వెళితే…. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటకు చెందిన ఊటుకూరు రమ్యకృష్ణ వృత్తి రీత్యా ఒక వైద్యురాలు. 2008 వరకు జగ్గయ్య పేట హెల్త్ సెంటర్ లో డాక్టర్ గా పనిచేసిన రమ్య అనంతరం గోవా లో ప్రభుత్వ అనుబంధ వైద్య సంస్థలో ఉద్యోగంలో చేరింది. అయితే మంగళవారం సాయంత్రం గోవా బీచ్ కి వెళ్లిన రమ్య నీళ్ల లోకి దిగి సెల్ఫీ తీసుకోవాలని చూసింది.

అయితే ఉన్నట్టుండి అటుగా వచ్చిన సముద్ర కెరటాలు ఒక్కసారిగా రమ్య ను లోపలికి లాకెళ్ళడం తో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

దీనితో రమ్య ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సెల్ఫీ ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు అనర్ధాలు చోటుచేసుకుంటున్నప్పటికీ ఈ తరం యువతీ యువకులలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. సెల్ఫీ కోసం నీళ్ల ల్లో కొంచం లోపలి వెళ్లడం తో రమ్య ఈ ప్రమాదానికి గురైనట్లు అధికారులు భావిస్తున్నారు.

కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.