వీర్వోల మధ్య గొడవ ! చెవినే కొరికేసాడు బాబోయ్  

Vro Bite Ear Of Another Vro Over Money Dispute In Kurnool-

ఇద్దరు అధికార్ల మధ్య ఏర్పడిన చిన్న వివాదం మరింత ముదిరి ఒకరి చెవిని మరొకరు కొరికేసిన సంఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది.అది కూడా వారు పనిచేసే ఎమ్మార్వో కార్యాలయంలోనే జరగడం సంచలనం రేపుతోంది.పూర్త వివరాలు పరిశీలిస్తే సుంకేశుల వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి, జోహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయ పరస్పరం దాడులు చేసుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు.ఈ క్రమంలో వేణుగోపాల్‌రెడ్డి చెవిని కృష్ణదేవరాయ కొరికేశాడు.దీనిపై రెవెన్యు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సుంకేశుల వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి కంప్యూటర్ ఆపరేటర్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు.

Vro Bite Ear Of Another Vro Over Money Dispute In Kurnool- Telugu Viral News Vro Bite Ear Of Another Over Money Dispute In Kurnool--Vro Bite Ear Of Another Over Money Dispute In Kurnool-

అయితే, ఓ రైతు భూమికి సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేయాలని కృష్ణదేవరాయ కోరాడు.అయితే, చాలా రోజుల నుంచి వివరాలు అప్‌డేట్ చేయకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నాడు.ఈ విషయంలో ఎమ్మార్వో ఎదుటే వీఆర్వోలు ఇద్దరూ గొడవపడ్డారు.అయితే, తాను ఎప్పుడో వివరాలు అప్‌డేట్ చేశానని వేణుగోపాల్ రెడ్డి చెప్పాడు.ఇద్దరూ అప్పటికప్పుడు సిస్టమ్‌లో చెక్ చేయగా, అందులో రైతు పేరు తప్పు ఉంది.దీంతో కావాలనే అలా చేశాడని కృష్ణదేవరాయ అనుమానం వ్యక్తం చేశాడు.

అయితే, ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా కలబడి కొట్టుకున్నారు.ఆవేశంలో వేణుగోపాల్ రెడ్డి చెవిని కృష్ణదేవరాయ కొరికివేశాడు.అయితే వీరిద్దరి మధ్య డబ్బు తగాదాలే అసలు కారణం అని తెలుస్తోంది.