తెలంగాణ‌కు మ‌రో కేంద్ర‌మంత్రి ప‌ద‌వి.. ఆ ఎంపీకి ఛాన్స్‌..?

త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు శ‌ర‌వేగంగా ఎన్డీయే పావులు క‌దుపుతోంది.చాలా ప‌క్కాగా రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు అనువుగా ఆయా రాష్ట్రాల నేత‌ల‌కు కేంద్ర మంత్రి, స‌హాయ మంత్రి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెడుతోంది.

 Another Union Minister Post For Telangana .. Chance For That Mp Babu Rao, Bjp, T-TeluguStop.com

ఈ నేప‌థ్యంలోనే కేంద్ర మంత్రి వ‌ర్గంలో ప‌నిచేస్తున్న ప‌లువురికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వులు ఇస్తూ వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటోంది.మ‌రీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో బ‌ల‌ప‌డేందుకు అన్ని రాష్ట్రాల‌కు ప్రాముఖ్యం క‌ల్పిస్తోంది.

ఈ మార్పుల్లో భాగంగానే తెలంగాణకు మ‌రో కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌వి ఖాయ‌మైన‌ట్టు తెలుస్తోంది.తెలంగాణ నుంచి ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తూ తెలంగాణ‌లో పార్టీ ప‌నుల‌ను చూసుకుంటున్నారు.

అయితే ఈ మార్పుల్లో భాగంగా కిష‌న్‌రెడ్డికి త్వ‌ర‌లోనే సహాయ మంత్రి ప‌ద‌వి నుంచి స్వతంత్ర స్థాయి కలిగిన సహాయమంత్రిగా స్థాన భ్ర‌మ‌ణం ఉంటుంద‌ని ఇప్ప‌టికే కేంద్ర నిఘా వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Telugu @bjp4india, Adilabad Mp, Bjp Mp, Cventral, Kishan Reddy, Renuka, Soyam Ba

ఇక ఆయ‌న‌కు తోడుగా తెలంగాణ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావుకు కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ ఇస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.గిర‌జ‌న నేత కావడం, ఉత్త‌ర తెలంగాణ‌లో ప‌ట్టు కోసం బీజేపీ ఈ వ్యూహం అమ‌లు చేయనుంద‌ని తెలుస్తోంది.ప్ర‌స్తుతం కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్‌ను ఈ మార్పుల్లో భాగంగానే కర్నాటక గవర్నర్‌గా నియ‌మించ‌గా గిరిజన వ్యవహారాల మంత్రిగా ఉన్న అర్జున్ ముండా, సహాయ మంత్రి రేణుక సింగ్ సరుటకు త్వ‌ర‌లోనే ఉద్వాస‌న ప‌లుకుతార‌ని తెలుస్తోంది.

Telugu @bjp4india, Adilabad Mp, Bjp Mp, Cventral, Kishan Reddy, Renuka, Soyam Ba

ఇక రేణుక ప్లేస్‌లో గిరిజ‌న స‌హాయ మంత్రిగా బాపూరావుకు అవ‌కాశం ఇస్తార‌ని స‌మాచారం.సోయం బాబూరావు గిరిజన, ఆదివాసీ నేత కావ‌డంతో వారిలో ప‌ట్టు పొందేందుకు ఈ ప్లాన్ బీజేపీ వేసిన‌ట్టు స‌మాచారం.అదే జ‌రిగితే బీజేపీకి ఆదివాసీల్లో అనూహ్యంగా బ‌లం పెరిగే ఛాన్ష్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube