ప్ర‌పంచానికి మ‌రో ముప్పు.. చైనా, ర‌ష్యాలో బ‌య‌ట ప‌డ్డ బ్లాక్ డెత్ ప్లేగు వ్యాధి

ప్ర‌పంచాన్ని ఇప్ప‌టికే క‌రోనా లాంటి మ‌హ‌మ్మారులు అత‌లాకుత‌లం చేసేస్తున్నాయి.ప్రాణాల‌ను అర చేతిలో పెట్టుకుని ప్ర‌జ‌లు కాలం వెల్ల‌దీస్తున్న సంగ‌తి చూస్తూనే ఉన్నాం.

 Another Threat To The World Black Death Plague Out In China And Russia, Black De-TeluguStop.com

ఇక‌పోతే మ‌న దేశంలో క‌రోనా సృష్టించిన విల‌య తాండ‌వం అంతా ఇంతా కాదు.ప్ర‌పంచంలో కెల్లా సెకండ్ వేవ్ మ‌న దేశంలోనే తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డింది.

ఒక‌నొక ద‌శ‌లో ఆస్ప‌త్రులు కూడా స‌రిపోక పిట్ట‌ల్లా జ‌నాలు రాలిపోయారంటే ప‌రిస్థితులు ఎంత భ‌యంక‌రంగా మారాయో అర్థం చేసుకోవ‌చ్చు.అదే స‌మ‌యంలో బ్లాక్ ఫంగ‌స్ కూడా దారుణంగా విజృంభించి తీవ్ర అత‌లాకుత‌లం చేసేసింది.

గ్లోబల్ వార్మింగ్ కార‌ణంగా కొత్త ర‌కాల వ్యాధులు పుట్టుకొస్తున్నాయి.గ‌తంలో ప్లేగు వ్యాధి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.దాని కార‌ణంగా అప్ప‌ట్లో కోట్లాది జ‌నాభా మ‌ర‌ణించారు.ఇంకా చెప్పాలంటే రెండో ద‌శాబ్ధ స‌మ‌యంలో యూరప్ దేశాల్లో 60శాతం జ‌నాభా పూర్తిగా మ‌ర‌ణించారు.

అంత‌టి భ‌యంక‌ర‌మైన మ‌హ‌మ్మారి ఇప్పుడు మ‌రోసారి క‌ల‌క‌లం రేపుతోంది.రీసెంట్ గా ఈ వ్యాధి మూలాలు రష్యా, యూఎస్, చైనాల్లో రీసెంట్‌గా బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా భ‌య‌ప‌డిపోతున్నారు.

దీంతో ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ బ్లాక్ డెత్ ను నిర్మూలించాలంటూ యునిసెఫ్ ప్రపంచ దేశాలను హెచ్చ‌రించింది.

Telugu @unicef, Threat, Black Plague, China, China Russia, Corona, Rats-Latest N

ఈ వ్యాధి అడవిలో సంచ‌రించే ఎలుకల మీద ఏవైనా ఈగ‌లు వాలి అవి నేరుగా వ‌చ్చి మ‌నుషుల మీద వాలితే మాత్రం వెంట‌నే వారికి ఈ వ్యాధి సోకుతుంది.ఇది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మంటే ఈ వ్యాధి సోకిన 24 గంటల్లోనే మ‌నుషులు మ‌ర‌ణిస్తారు.ఈ ర‌క‌మైన బుబోనిక్ ప్లేగు వ్యాధి ఒక మ‌నిషి నుంచి మ‌రో మ‌నిషికి చాలా సులువుగా సోకుతుంది.

కేవ‌లం ఈగల నుంచే ఈ వ్యాధి అత్య‌ధికంగా సోకుతుంద‌ని సైంటిస్టులు వెల్ల‌డిస్తున్నారు.కాంగో అలాగే మడగాస్కర్ తో పాటుగా పెరూ లాంటి దేశాల‌ను ఈ వ్యాధిఇప్ప‌టికే వ‌ణికిస్తోంది.

ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెబుతున్నారు సైంటిస్టులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube