భూమికి మరో ముప్పు.. దూసుకొస్తున్న ఆస్టరాయిడ్

ఈ సమస్త లోకంలో భూమి అనేది ఓ గ్రహం.భూమిపైకి అనేక ప్రమాదాలనేవి అప్పుడప్పుడూ ముంచుకొస్తూ ఉంటాయి.గతంలో భూమిపైకి భారీ సౌర తుఫాను ముంచుకొచ్చింది.ఆ తర్వాత ఆ ముప్పు తొలగిపోయింది.ఇప్పుడు తాజాగా మరో ముప్పు ముంచుకొస్తోంది.భూమికి ఆ ముప్పు రాబోతుందని చైనా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

 Another Threat To Earth A Looming Asteroid-TeluguStop.com

జూలై 24వ తేదిన అంతరిక్షంలో నుంచి స్టేడియం లాగా ఉండేటటువంటి అతిపెద్ద ఆస్టరాయిడ్ అంటే గ్రహశకలం అనేది భూమి మీదకు రాబోతోందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.దాని పేరు 2008 GO20 అనే గ్రహశకలంగా పరిశోధకులు గుర్తించారు.

ఇటువంటి భారీ ఆస్టరాయిడ్ అనేది కేవలం గంటకు 18వేల మైళ్ల వేగంతో భూమి మీదకు రాబోతున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ ఆస్టరాయిడ్ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికన్ సైన్స్ ఏజెన్సీ నాసా తెలిపింది.

 Another Threat To Earth A Looming Asteroid-భూమికి మరో ముప్పు.. దూసుకొస్తున్న ఆస్టరాయిడ్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాసా ప్రకారంగా మనం చూసినట్లైతే ఈ ఆస్టరాయిడ్ జూలై 24వ తేదిన భూమికి అతి దగ్గరగా వస్తుంది.అది అపోలో క్లాస్ ఆస్టరాయిడ్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది తాజ్ మహల్ సైజ్ లాగా ఉంటుంది.దానికంటే మూడు రెట్లు పెద్దదిగా ఈ ఆస్టరాయిడ్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

నాసా ప్రకారంగా చూసినట్లైతే ఈ గ్రహశకలం అనేది సుమారుగా 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా రాతి అవశేషాలుగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.ఇప్పుడు విశ్వంలో మనం చూసినట్లైతే 1,097,106 గ్రహశకలాలు ఉన్నట్లు వారు గుర్తించారు.ఉల్కల కంటే చాలా భిన్నంగా ఈ గ్రహశకలాలు అనేవి ఉంటాయని వారు తెలిపారు.

Telugu Asteroids, Earth, Fly, Sciences, Social Media, Viral Latest, Viral News-Latest News - Telugu

ఇటువంటి అతిపెద్ద భారీ గ్రహశకల గమనాన్ని పక్కకు మరలించేందుకు చైనా పరిశోధకులు భారీ రాకెట్లను పంపనున్నారు.2021 నుంచి 2022 ప్రారంభంలో కూడా అమెరికా రొబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేయనుంది.భూమికి అతిదగ్గరగా వచ్చే రెండు ఆస్టరాయిడ్లను అడ్డుకునేందుకు ఈ రొబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.

#Earth #Social Media #Sciences #Asteroids

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు