రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా ఆటగాడు..!

టీమిండియా ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా మంగళవారం రోజు కలకత్తాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీ20, వన్డే మరియు టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని వెల్లడించారు.2009వ సంవత్సరంలో ఎంఎస్ ధోని నాయకత్వంలో శ్రీలంక తో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన అశోక్ దిండా.2010లో వన్డే క్రికెట్ ఫార్మాట్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు.తన మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో 34 పరుగుల గాను ఒక వికెట్ తీశారు.తొలిసారిగా జింబాబ్వేతో జరిగిన వన్డే లో ఆడిన అశోక్ 7.2 ఓవర్లకు 49 పరుగులకు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.

 Another Team India Player Who Has Announced His Retirement     Indian Cricketer,-TeluguStop.com

Telugu Ashok, Indian, Ups, Bengal-Latest News - Telugu

అయితే ఆయన కెరీర్ లో మొత్తం 13 వన్డేల్లో ఆడగా 12 వికెట్స్ తీశారు.అయితే ఆయన చివరిసారిగా 2013లో రాజ్ కోటలో ఇంగ్లాండ్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో ఆడారు.36 ఏళ్ల అశోక్ దిండా తన 12 సంవత్సరాల కెరీర్ లో 400 ఫస్ట్ క్లాస్ వికెట్స్ తీశారు.2010 నుంచి 2013 సంవత్సరం కాలంలో ఆయన ఇండియా తరఫున మొత్తం 9 టీ20 మ్యాచ్లు ఆడారు.ఐపీఎల్ లో 78 మ్యాచ్లు ఆడి 69 వికెట్లను పడగొట్టారు.ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పై ఆడిన ఆయన 18 పరుగులకే నాలుగు వికెట్లను తీసి వావ్ అనిపించారు.

అశోక్ దిండా పశ్చిమ బెంగాల్ కి దశాబ్దానికి పైగా ప్రాతినిధ్యం వహించారు.అయితే ఆయనపై తప్పుడు ఆరోపణలు రావడంతో పశ్చిమ బెంగాల్ జట్టు నుంచి ఆయన తప్పుకున్నారు.

అయితే ఈ సీజన్ లో గోవా కి ఆయన ప్రాతినిధ్యం వహించారు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో కూడా ఆయన పాల్గొన్నారు.

భారతదేశం తరపున ఆడేందుకు అవకాశం ఇచ్చిన బిసిసిఐకి ధన్యవాదాలు చెప్పిన అశోక్ దిండా దీప్‌దాస్‌ గుప్తా, రోహన్‌ గావస్కర్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు తనకు మార్గనిర్దేశనం చేశారని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube