ఆస్ట్రేలియా సిరీస్ నుంచి మరో టీమిండియా ఆటగాడు అవుట్..!

సిడ్నీ టెస్ట్ లో గొప్ప ప్రదర్శన కనబరిచిన టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి గాయాలపాలయ్యారు.హనుమ విహారి కాలి పిక్కకు గాయం కావడంతో ఆయన కీలకమైన 4వ టెస్ట్ మ్యాచ్ కి దూరం అయ్యారు.గ్రేడ్-1 స్థాయిలో గాయం తగిలి ఉంటే.విహారి 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

 Another Team India Player Out Of Australia Series, Australia, India , Test Serie-TeluguStop.com

కనీసం 30 రోజుల గాయం పూర్తిస్థాయిలో తగ్గడానికి అవకాశాలుంటాయి.సో, దీన్ని బట్టి చూస్తుంటే విహారి బ్రిస్బేన్‌.

భారతదేశంలో త్వరలో జరిగే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు కూడా దూరం కావచ్చునని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

సిడ్నీ మూడవ టెస్ట్ లో గాయమైనా అశ్విన్ తో కలసి మ్యాచ్ చివరిదాకా క్రీజ్ లో నిలబడి టీమిండియా జట్టును ఓటమి నుంచి కాపాడిన విహారి సర్వత్ర ప్రశంసలను పొందుతున్నారు.

టీమిండియా పట్ల అంకిత భావం కలిగి.తన నొప్పి ని కూడా భరిస్తూ ఆట ఆడిన విహారి పై హర్ష భోగ్లే వంటి ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు కానీ ఆయన ఇంగ్లాండ్ టెస్ట్ కి దూరమవుతున్నారని తెలిసి బాధపడుతున్నారు.

మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, కే.ఎల్ రాహుల్ గాయాలపాలై టెస్ట్ సిరీస్ నుంచి పూర్తిగా వైదొలగగా ఇప్పుడు విహారి కూడా టెస్ట్ సిరీస్ కు దూరమయ్యారు.

Telugu Australia, India, Insured, Vihari-Latest News - Telugu

దీంతో టీమిండియా కి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.అయితే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వృద్ధిమాన్ సాహా జట్టులోకి రప్పించడానికి టీమిండియా ప్రయత్నిస్తోంది.ఆయన చేత వికెట్ కీపింగ్ చేయించి.పంత్ చేత బ్యాటింగ్ చేయించబోతున్నారని తెలుస్తోంది.రవీంద్ర జడేజా ఇంతకుముందు గాయాలపాలయ్యారు.మొన్నటి మ్యాచ్ లో కూడా ఆయనకు బాల్ తగిలి తీవ్ర గాయం అయింది.

ఇతను కూడా టెస్ట్ సిరీస్ కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని తెలుస్తోంది.రవీంద్ర జడేజా స్థానంలో శార్దూల్ ఠాకూర్ వస్తారని తెలుస్తోంది.

బ్రిస్బేన్ జనవరి 15వ తేదీన ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనున్నది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube