వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్... మెసేజ్‌లను ఇపుడు ఈజీగా పిన్ చేసేయండిలా!

ప్రముఖ ఇన్‌స్టంట్ సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతూ యూజర్లకు మరింత దగ్గరగా వెళుతోంది.నేడు వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే ఇక అర్ధం చేసుకోండి, ఎంతలా ప్రాచుర్యం పొందిందో? ఇకపోతే తాజాగా WABetaInfo నివేదిక ప్రకారం చూసుకుంటే, రాబోయే ఫీచర్ వాట్సాప్ యూజర్ల గ్రూప్‌ల నుంచి లేదా పర్సనల్ చాట్‌ల నుంచి చాట్‌లో పైభాగంలో ముఖ్యమైన మెసేజ్‌లను పిన్ చేసేందుకు అనుమతిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ కొత్త ఫీచర్‌ని రిలీజ్ చేసిన తర్వాత యూజర్‌లు మెసేజ్‌లను తేలికగా పిన్ చేసుకోవచ్చు.

 Another Super Feature In Whatsapp  Pin Messages Now Easily,  Whatsapp, Chat, Pin-TeluguStop.com

Telugu Chat, Latest, Ups, Whatsapp-Latest News - Telugu

ఇకపోతే వాట్సాప్ పాత వెర్షన్‌ని మీరు వినియోగించినట్టైతే ప్లే స్టోర్ నుంచి యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ పిన్ చేసిన మెసేజ్‌లు గ్రూప్‌లలో ఆర్గనైజ్డ్ చాట్‌లను మెరుగు పరచడంలో సాయపడతాయి.అయితే ప్రస్తుతానికి, చాట్‌లు, గ్రూప్‌లలో మెసేజ్‌లను పిన్ చేసే ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరో కొత్త విషయం ఏమిటంటే, ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ కూడా కొత్త ఫీచర్‌పై పని చేసేందుకు ప్లాన్ చేస్తోంది.ఆండ్రాయిడ్ యూజర్లకు సులభంగా కాల్‌లు చేసేందుకు సాయపడుతుందని నివేదిక సూచిస్తుంది.

Telugu Chat, Latest, Ups, Whatsapp-Latest News - Telugu

ఇక WABetaInfo నివేదిక ప్రకారం చూసుకుంటే, అప్లికేషన్‌తో కలిపి వాట్సాప్ కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ కాంటాక్ట్ లిస్ట్‌లోని కాంటాక్ట్ సెల్‌ను ట్యాప్ చేయడం ద్వారా యూజర్లు తేలికగా కాలింగ్ చేసుకునేందుకు వీలుంది.అంతేకాకుండా రాబోయే ఫీచర్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత డివైజ్ హోమ్ స్క్రీన్‌కు ఆటోమాటిక్‌గా యాడ్ చేస్తుందని ఈ నివేదిక తెలియజేస్తుంది.ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్, నవంబర్‌లో భారత్‌లో36.77 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన సంగతి విదితమే.అయితే ఈ సంఖ్య.గత నెలలో నిషేధించిన వాట్సాప్ అకౌంట్ల సంఖ్య కన్నా తక్కువగానే ఉందని తెలిపింది.కాగా భారత్‌లో నిషేధించిన వాట్సాప్ అకౌంట్లలో 13.89 లక్షల అకౌంట్లు ఉండడం కొసమెరుపు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube