ముంచుకొస్తున్న మరో తుఫాను .. ఏపీ వాసులు సేఫ్..!!

దాదాపు కొద్ది నెలల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచి కోడుతున్నాయి.దీంతో వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి.

లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి.చేతికి అందిన పంటలు నష్టాలు పాలవుతున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మరో తుఫాను రాబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.అయితే ఈ తుఫాను ఉత్తర ఒడిశా.

పశ్చిమ బెంగాల్ వైపు కదిలే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది.ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

Advertisement

ఇది పశ్చిమ వాయువ్య అతిశగా పయనించి 22వ తేదీ నాటికి వాయుగుండంగా ఆ తర్వాత 48 గంటల తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.ఈ క్రమంలో తొలిత "ఆంధ్ర- ఒడిశా" మధ్య తీరం దాటవచ్చని భావించిన గాని తీరం వైపు వచ్చిన మధ్యలో దిశ మార్చుకొని "ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్" వైపు కదిలే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

కానీ దీని ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు