దేశంలో లాక్ డౌన్ లో కి మరో రాష్ట్రం..??

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇండియా లో అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.దాదాపు రోజుకి మూడు లక్షలకు పైగా కొత్త కేసులు బయటపడటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నాయి.

 Another State Bihar In The Country Will Be Under Lock Down, Corona Second Wave,-TeluguStop.com

ముఖ్యంగా కరోనా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో.అప్రమత్తంగా ఉన్న భారత్ సెకండ్ వేవ్ విషయంలో అట్టర్ ఫ్లాప్ అవడానికి గల కారణం పాలకులే అంటూ అంతర్జాతీయ మీడియా భారత ప్రభుత్వంపై మండిపడుతోంది.

అత్యంత భయంకరమైన ఈ వైరస్ గురించి తెలుసుకున్న గాని ఇండియాలో ఎన్నికలు జరగడం మాత్రమే కాక కుంభమేళాలు మరియు ప్రార్థనాలయాలు ఓపెన్ చేయటంతో పాటు కరోనా నిబంధనలు.ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని.

ఓ రకంగా అంతర్జాతీయ మీడియా భారత్ పాలకులపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తోంది.ముఖ్యంగా దేశానికి ప్రధాని అయి ఉండి.

వైరస్ వ్యాప్తి విషయంలో అలక్ష్యం వహిస్తూ .స్వయంగా ఎలక్షన్ ప్రచారంలో పెద్దపెద్ద మీటింగ్లో పాల్గొనటాని ఖండిస్తూ అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తిపోసింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా బీహార్ రాష్ట్రంలో కూడా కేసులు భారీగా పెరిగిపోతూ ఉండటంతో ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ .లాక్ డౌన్ విధించే రీతిలో అక్కడి అధికారులతో సమావేశాలు అవుతున్నారట.దీంతో ఈ రోజు సాయంత్రం లోపు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube