ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 ఇక కేవలం మూడు వారాలు మాత్రమే ఉండటంతో చివరి దశకు చేరుకుంది.కేవలం 20 రోజుల్లో బిగ్ బాస్ షోకి శుభం కార్డు పడబోతుంది.
ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు బిగ్ బాస్ విజేతగా నిలుస్తారు అన్న విషయంపై ఉత్కంఠత నెలకొంది.ఈ విషయం ఇలా ఉంటే మరెందరో సినీ తారలు బిగ్ బాస్ షో నుండి వారి సినిమాలను ప్రమోట్ చేయడానికి ఇష్టపడుతున్నారు.
అయితే ఈసారి కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాకపోవడం నేపథ్యంలో ఎక్కువ మంది తారలు బిగ్ బాస్ షోకు రాలేకపోయారు.
ఇదివరకు దసరా పండుగ సందర్భంగా అఖిల్ బిగ్ బాస్ వేదికపై నుండి తాను తాజాగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ చేసుకోగా తాజాగా మరో స్టార్ హీరో తన చిత్రం సంబంధించి ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ షోకు హాజరు కాబోతున్నాడు.
ఆ హీరో ఎవరో కాదు కన్నడ సినిమాలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న హీరో సుదీప్.ఆయన తాజాగా నటించిన ఫాంథమ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నేడు బిగ్ బాస్ షో కు హాజరు కానున్నాడు.
బిగ్ బాస్ ప్రసారమయ్యే సమయంలో కొద్దిసేపు నాగార్జునతో కలిసి ఆయన సందడి చేయబోతున్నాడు.అయితే ఈ విషయాన్ని తాజాగా హీరో సుదీప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వార తెలిపారు.
ఇందుకు సంబంధించి వారు కలిసి ఉన్న ఫోటోని కూడా పోస్ట్ చేశాడు.అక్కినేని నాగార్జునతో కలిసి తెలుగు బిగ్ బాస్ తెరపై కనిపించడం, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో మాట్లాడుతూ సరదాగా గడపడం చాలా ఆనందంగా ఉందని ఆయన తన ట్వీట్ లో తెలిపారు.