మరో హీరోతో కలిసి కబ్జా చేస్తున్న ఉపేంద్ర  

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సాండల్‌వుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.కన్నడలో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతాయి.

TeluguStop.com - Another Star Hero In Upendra Kabzaa

కాగా తాజాగా ఆయన కబ్జా అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సినిమాలో హీరో ఉపేంద్రతో పాటు మరో హీరో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

TeluguStop.com - మరో హీరోతో కలిసి కబ్జా చేస్తున్న ఉపేంద్ర-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో నటిస్తున్న ఆ మరో హీరో ఎవరో సంక్రాంతి సందర్భంగా తెలియజేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.కబ్జా అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమాలో ఉపేంద్రతో పాటు నటిస్తున్న మరో స్టార్ ఎవరనే విషయాన్ని ఎక్కడా లీక్ కాకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్త పడ్డారు.ఇక సంక్రాంతి రోజున ఉదయం 10 గంటలకు ఆ స్టార్ ఎవరనే ఆసక్తికి తెరదించనున్నారు.

ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు ఉపేంద్ర రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో ఉపేంద్ర లుక్ చాలా వైవిధ్యంగా ఉండి ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాను చంద్రు డైరెక్ట్ చేస్తుండగా ఇందులో ఉపేంద్ర ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.ఉపేంద్ర సరసన ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

అంతేగాక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ నటిస్తుండటంతో కబ్జా చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.మరి ఈ సినిమాలో నటిస్తున్న ఆ మరొక స్టార్ ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

#Kabzaa #Upendra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు