చరణ్ కోసం మరో స్టార్ హీరో.. ఎవరై ఉంటారో?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు ఆచార్య చిత్రంలో కూడా చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

 Another Star Hero In Ram Charan Shankar Movie, Ram Charan, Shankar, Rc15, Mega H-TeluguStop.com

కాగా ఈ సినిమా తరువాత చరణ్ సోలోగా నటిస్తున్న చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇటీవల చేశారు.సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అతి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాలో చరణ్‌తో పాటు మరో మెగా హీరో కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండబోయే పాత్రలో ఓ స్టార్ హీరోను నటింపజేయాలని శంకర్ భావిస్తున్నాడట.

ఇక ఇప్పటికే శంకర్ ఆ స్టార్ హీరోను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించాడని తెలుస్తోంది.

మొత్తానికి చరణ్-శంకర్ కాంబోలో రాబోయే సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు పలువురు స్టార్ టెక్నీషియన్లు తీసుకోవాలని శంకర్ భావిస్తున్నాడట.అయితే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా శంకర్ తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది.

మరి శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోయే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా, ఈ సినిమాలో నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరా అనే అంశాలకు సమాధానం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube