షాకింగ్ న్యూస్ టిడిపిలోకి జగన్ రైట్ హ్యాండ్     2017-11-20   00:25:37  IST  Bhanu C

జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇలా ప్రారంభించాడో లేదో చంద్రబాబు నాయుడు తన ఆపరేషన్ స్టార్ట్ చేశాడు.నవంబర్ ఆరు న జగన్ పాదయాత్ర మొదలు పెడితే అదేరోజు నుంచీ వైసీపి నాయకులు టిడిపిలోకి జంప్ అయ్యేలా పక్కా ప్లాన్డ్ గా స్కెచ్ వేసుకున్నారు అప్పుడు మొదలయ్యిన వలసల కార్యక్రమం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.చంద్రబాబు 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని..టిడిపికి కలిసొచ్చే వారందరినీ దగ్గర ఉంది మరీ సైకిల్ ఎక్కించుకుంటున్నారు. ఈ లిస్టులో ఉన్న‌వారిలో ఇప్ప‌టికే చాలా మంది టీడీపీలోకి వెళ్లిపోగా మిగిలిన వారు కూడా రేపో మాపో సైకిల్ ఎక్కేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

వైసీపిలో ఇప్పటికే చాలా కీలకమైన వ్యక్తులు జగన్ కి హ్యాండ్ ఇస్తూ వచ్చారు..ఇక తాజాగా మరొక వికెట్ జగన్ కి రైట్ హ్యాండ్ గా ఉన్న వికెట్ టిడిపిలో కి జంప్ అవ్వడానికి సిద్దంగా ఉంది. వైఎస్ తో ఎంతో అనుభందం ఉన్న ఆ ఫ్యామిలీ ఇప్పుడు జగన్ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉంది…ఇప్పుడు జగన్ ని విడిచి చంద్రబాబు వెంట నడవడానికి సర్వం సిద్దం చేసుకుంది. అనంత‌పురం జిల్లా మాజీ ఎమ్మెల్యే గురునాథ‌రెడ్డి చంద్ర‌బాబును క‌ల‌వ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది..ముఖ్యంగా జగన్ వర్గంలో ఇది మరింత అలజడిని రేపుతోంది. జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్న గురునాథ‌రెడ్డి 2012లో జ‌గ‌న్ కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి విజ‌యం సాధించారు. అనూహ్యంగా గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు.

జ‌గ‌న్‌తో గురునాథ‌రెడ్డికి కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అని తెలుస్తోంది అందుకే ఇద్దరు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని టాక్…ఇక జ‌గ‌న్ తాజాగా గురునాథ‌రెడ్డికి చెప్ప‌కుండానే ఆయ‌న్ను నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి మైనార్టీ నేత న‌దీమ్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోయిందట. గురునాథ‌రెడ్డి చంద్రబాబు భేటీ తరువాత కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటకి వచ్చాయి..తమ ఫ్యామిలీ మొత్తం టిడిపిలోకి వెళ్ళడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నారని సమాచారం..గురునాథ‌రెడ్డికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టిడిపి కమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అందోళన చెందుతున్నారట. మరి ఇద్దరినీ చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తారో వేచి చూడాలి