వంట గ్యాస్ సిలిండర్ విషయంలో మరో షాకింగ్ న్యూస్..!!

దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రజల నుండి అనేక విమర్శలు కేంద్రంపై వస్తున్నాయి.ముఖ్యంగా మధ్యతరగతి అదేవిధంగా పేద ప్రజలు బతికే పరిస్థితుల్లో దేశంలో లేవని చాలా మంది రాజకీయ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు.

 Another Shocking News Regarding Cooking Gas Cylinder , Gas, Petrol, Diesel, Cent-TeluguStop.com

  ఇలాంటి తరుణంలో మరోవైపు వంటగ్యాస్ సిలిండర్ ధర విషయంలో 25 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు ప్రకటించడం జరిగింది.

దీంతో ఒకే నెలలో మూడు సార్లు వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి నట్లయింది.

తాజాగా పెంచిన ధర తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది.ఫిబ్రవరి 4వ తారీఖున ₹25 పెంచగా ఆ తర్వాత 15వ తారీఖున 50 రూపాయలు పెంచారు.

అయితే తాజాగా 25 రూపాయలు పెంచటంతో నెలలో మొత్తంగా  గ్యాస్ సిలిండర్ ధర వంద రూపాయలు పెరిగినట్లు అయింది.దీంతో సామాన్య ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పై మండిపడుతున్నారు.

ఇలా అయితే బతికే పరిస్థితి దేశంలో ఉండదని లబోదిబోమంటున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube