అచ్చెన్నాయుడికి మ‌రో షాక్‌.. వైసీపీకి క‌లిసొచ్చే అంశం..

ఏపీ రాజ‌కీయాలను చూస్తుంటే ఇప్ప‌ట్లో టీడీపీ గ‌ట్టెక్కుతుందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.ఓ వైపు జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంటే టీడీపీ మాత్రం ఇంకా సొంత పార్టీనేత‌ల ఇబ్బందుల్లోనే ఉంటోంది.

 Another Shock To Achennayudu Ycp Benfit Topic-TeluguStop.com

ఇప్ప‌టికే టీడీపీని చాలామంది చాలా ర‌కాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు.ఒక‌రిపి ఒక‌రు ఫిర్యాదులు చేసుకోవ‌డంతోనే స‌రిపోతుంది.

ఇక చంద్ర‌బాబు నాయుడికి అయితే వీరికి స‌ర్దిచెప్ప‌డంతోనే స‌మ‌యం అంతా గ‌డిచిపోతోంది.టీడీపీ నేత‌లు ఆయ‌న‌పైనే విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదు.

 Another Shock To Achennayudu Ycp Benfit Topic-అచ్చెన్నాయుడికి మ‌రో షాక్‌.. వైసీపీకి క‌లిసొచ్చే అంశం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండ‌గా ఇప్పుడు అంతో ఇంతో రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్న అచ్చెన్నాయుడి వ్య‌వ‌హారం టీడీపీకి పెద్ద దెబ్బ కొడుతోంది.ఆయ‌న జూలై నెల‌లో అసెంబ్లీ స్పీకర్ అయిన‌టువంటి తమ్మినేని సీతారాంపై ఓ స‌మ‌యంలో చేసిన‌టువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలపై ఇప్ప‌టి దాకా దుమ‌రాం కొన‌సాగుతోంది.

అయితే ఆయ‌న ఇచ్చిన‌టువంటి వ్య‌క్తిగ‌త వివ‌ర‌ణ‌పై సంతృప్తి చెంద‌ని క‌మిటీ ఆయ‌న్ను త‌మ ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఉన్న అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆయ‌న్ను హాజ‌రు ప‌రిచింది.

Telugu Achennayudu, Ap Poltics, Chandra Bbau, Kakani Govardhan Reddy, Previllege Commette, Tamminani Seetharam, Tdp, Ycp, Ys Jagan-Telugu Political News

ఇక ఆయ‌న కూడా స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు అధికారికంగా క్షమాపణలు చెబుతున్న‌ట్టుతెలిపారు.స్పీక‌ర్‌పై చేసిన‌టువంటి త‌న వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వివ‌రించ‌డంతో ఆయ‌న‌పై ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ న‌డుస్తోంది.దీన్ని ఆస‌రాగా చేసుకుని వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఇలాంటి త‌ప్పులు చేడ‌యం అచ్చెన్నాయుడికి అల‌వాటేన‌ని, ఆయ‌న ఇలాంటివి చేయ‌డం త‌గ్గించుకోవాలంటూ సూచిస్తున్నారు.దీంతో ఇది కాస్తా ఇప్పుడు టీడీపీకి మైన‌స్‌గా అలాగే వైసీపీకి క‌లిసొచ్చే అంశంగా మారిపోయింది.

వారిదీనిపై మ‌రింత ప్ర‌చ‌రాం చేసే అవ‌కాశం కూడా ఉంది.ఇదివైసీపీకి మ‌రో అస్త్రంగా కూడా మారే ఛాన్స్ ఉంది.

మ‌రి అచ్చెన్నాయుడు ముందు ముందు ఎలా స్పందిస్తారో చూడాలి.

#AP Poltics #Achennayudu #YS Jagan #Chandra Bbau

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు