కేసీఆర్‌కు మరో షాక్.. దళిత బంధు ప్లాన్ రివర్స్ అయ్యిందే..!

హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రెస్టీజియస్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్ అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుపును కాంక్షిస్తూనే ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టును అక్కడికి తరలించారన్న విషయం ప్రతీ ఒక్కరికి అర్థమయింది.అయితే, ఈ పథకం కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక రకంగా తలనొప్పి తెచ్చి‌పెట్టిందనే చెప్పొచ్చు.

 Another Shock For Kcr Dalit Kinship Plan Has Been Reversed-TeluguStop.com

సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజలు రాజీనామా చేయాల్సిందేనని కోరడాన్ని మనం గమనించొచ్చు.ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందనే భావనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని ప్రకటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కేసీఆర్‌కు మరో షాక్ తగలబోతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.దళిత బంధు మాదిరిగా ఇతర బంధులు పెట్టాలని వివిధ సామాజిక వర్గాల డిమాండ్ ఉండబోతుందని పేర్కొంటున్నారు.

 Another Shock For Kcr Dalit Kinship Plan Has Been Reversed-కేసీఆర్‌కు మరో షాక్.. దళిత బంధు ప్లాన్ రివర్స్ అయ్యిందే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా, వారి అంచనా నిజమే అయింది.

తాజాగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యబీసీ బంధుపెట్టాలని డిమాండ్ చేయడం అధికార పార్టీని చిక్కుల్లో పెట్టడమేనని పలువురు అంచనా వేస్తున్నారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ఆర్.

కృష్ణయ్య బీసీ బంధు ప్రవేశపెట్టాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో వెనుకబడిన బీసీల సంక్షేమం కోసం ఈ పథకం ప్రవేశపెడితే ఆ వర్గాలకు మంచి జరుగుతుందని కృష్ణయ్య చెప్తున్నారు.

బీసీల అభివృద్ధికి కూడా సీఎం కేసీఆర్ కృషి చేయాలనే డిమాండ్ పెట్టడం ద్వారా దళిత బంధు ప్లాన్ రివర్స్ అయ్యేనా? అనే చర్చ కూడా షురూ అవుతున్నది.బీసీ బంధు ద్వారా ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయడాన్ని కోరడం సేమ్ దళిత బంధు మాదిరిగానే కదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bc Bandhu, Corona, Dalitha Bandhu, Ecnomical Problems, Kcr, R Krishnya, R Krishnyya Demand Bc Bandhu, Ts Govt Scheme, Ts Poltics-Telugu Political News

మొత్తంగా తానొకటి తలిస్తే ఇంకొకటి అయినట్లు దళిత బంధు నుంచి మొదలుకుని ఇక అన్ని వర్గాల బంధు, సామాజిక వర్గాల వారికి బంధు లు పెట్టుకుంటూ పోతే ఖజనా ఎలా అనే ప్రశ్న మేధావుల నుంచి వస్తున్నది.ఇప్పటికే కొవిడ్ పరిస్థితులతో రాష్ట్ర ఖజనా అంతంత మాత్రంగానే ఉందని సంగతి ప్రభుత్వం గుర్తించి, గ్రౌండ్ రియాలిటీపై అంచనా వేసుకోవాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.ఖజనా లేకపోతే ‘దళిత బంధు’ కూడా ఆగిపోయే చాన్సెస్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

#RKrishnyya #Bc Bandhu #R Krishnya #Corona #Ts Poltics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు