డార్క్‌వెబ్‌ హ్యాకర్‌తో ఫేస్‌బుక్‌ యూజర్లకు మరో షాక్‌..!

ఇటీవల ఫేస్‌బుక్ సర్వీసులు గంటలపాటు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఆందోళన పడ్డారు.మళ్లీ ఫేస్‌బుక్, వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తాయా అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు.

 Another Shock For Facebook Users With Darkweb Hacker, Facebook , Users ,data Sol-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చే న్యూస్ వెలుగులోకి వచ్చింది.ఒక నివేదిక ప్రకారం, ఫేస్‌బుక్ యూజర్ల డేటాను హ్యాకర్లు కొనుగోలు చేశారట.

ఫేస్‌బుక్ సేవలు స్తంభించిపోయిన సమయంలో ఫేస్‌బుక్ యూజర్ల డేటా డార్క్ వెబ్ హ్యాకర్ ఫోరమ్ లో విక్రయించినట్టు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ తెలిపింది.ఈ డేటాలో ఫేస్‌బుక్‌ యూజర్ల అడ్రస్, పేరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లను ఉన్నట్టు తెలిపింది.1.5 బిలియన్ ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను హ్యాకర్లు కొనుగోలు చేసినట్లు నివేదిక వెల్లడించడంతో యూజర్లు షాక్ అవుతున్నారు.

ఇదిలా ఉండగా, నివేదిక చెప్పినట్టుగా డార్క్ వెబ్ నుంచి ఎలాంటి డేటాను తిరిగి పొందలేదని సదరు హ్యాకర్ రిపోర్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.ఇక హ్యాకర్ల నుంచి ఫేస్‌బుక్‌ డేటా కొనుగోలు చేసుకోవాలనుకున్న కొందరు వేల డాలర్లు చెల్లించారట.

కానీ హ్యాకర్లు మాత్రం హ్యాక్ చేసిన డేటాను సెండ్ చేయకుండా మోసం చేసినట్లు తెలుస్తోంది.దాంతో ఇదంతా ఒక స్కామ్ అయి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఫేస్‌బుక్‌ మాత్రం యూజర్ల డేటాకు ఎలాంటి డోకా లేదని.ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Telugu Sold, Hacker Forum, Stopped, Latest, Whatsapp-Latest News - Telugu

తమ యూజర్లకు పటిష్టమైన సెక్యూరిటీ అందిస్తున్నామని తెలిపింది.యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకపోయినా.ఫేస్‌బుక్‌ కి మాత్రం ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.నెగిటివ్ కథనాల నేపథ్యంలో మార్క్ జుకర్‌బర్గ్ వేల కోట్లు నష్టపోయారు.ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధించినప్పటికీ.కొందరు యూజర్లు సాంకేతిక సమాచారం ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

ఇప్పటికీ సాంకేతిక సమస్యలను తీర్చే పనిలోనే ఫేస్‌బుక్‌ ఉందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube