సామాన్యుడి నెత్తిన ధరల పిడుగు.. భారీగా పెరగనున్న పాల ధ‌ర‌.. ?

మధ్యతరగతి మానవుడు ఎప్పుడు ఆశాజీవిగా మిగిలి పోతూనే ఉంటాడు.అంతెందుకు కౌలు రైతు గురించి తెలుసుకుంటే.

 Another Shocking News For Common People Milk Prices To Rise,  Milk, Rates, Hiked-TeluguStop.com

తనది కాని భూమిలో రెక్కల కష్టం చేసి, ఫలితం కోసం ఆకాశం వైపు చూస్తాడు.విధి వెక్కిరించినా, ప్రకృతి కన్నెర చేసినా, తన కష్టం నేలపాలు అయితే రోదిస్తాడు.

ప్రస్తుతం లోకంలో ఓటర్ల బ్రతుకులు కూడా ఇలాగే తగలడ్దాయట.నాయకుల నెత్తిన కిరీటం పెట్టి రాష్ట్రాన్ని దోచుకొమ్మని పంపిస్తారు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో వరుసగా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, ఉల్లి ధరల‌తో పాటు ప‌లు వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే.ఈ పరిస్దితుల్లో సామాన్యుడి మీద పాల ధ‌ర‌ల పెరుగుద‌ల రూపంలో మ‌రో పిడుగు ప‌డ‌నుంది.

కాగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని రాట్లం సిటీలో పాల ధరలు పెరగనున్న నేపథ్యంలో దాని ప్ర‌భావం దేశం మొత్తం మీద పడుతుందట.ఈ నెల 23న ఆయా సంఘాలు స‌మావేశం నిర్వహించి లీటరు పాలపై రూ.12 పెంచాల‌ని నిర్ణ‌యించాయట.ఈ మేర‌కు అధికారుల అనుమతితో వ‌చ్చేనెల 1 నుంచే ఈ ధరల‌ పెంపును అమలు చేయడానికి సిద్దం అవుతున్నారట.

ఇక ఆ కొత్త ధరలను చూస్తే.ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.43గా ఉండగా ఈ పెంపుతో లీటరుకు రూ.55కు చేర‌నుందట.ఇప్ప‌టికే పాల ధర అధికంగా ఉంది.కాగా ఈ కొత్త ధ‌రలు గనుక అమలైతే ప్రజల కళ్లు బైర్లుకమ్మడం ఖాయమని అనుకుంటున్నారట.ఇక ఇదంతా పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube