ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ గాడ్ ఫాదర్?

Another Sensation In Bollywood Along With Aryan Khan Case Is He The Next Target Of Ncb

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా తీవ్ర కలకలం రేపుతోంది అని చెప్పవచ్చు.ఈ కేసులో భాగంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు ఎప్పుడు ఎవరిని ఈ కేసులోకి లాగుతారో అర్థంకాని పరిస్థితులలో ఉన్నారు.

 Another Sensation In Bollywood Along With Aryan Khan Case Is He The Next Target Of Ncb-TeluguStop.com

ఈ క్రమంలోనే అక్టోబర్ 3వ తేదీ క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆర్యన్ ఫోన్ ను పరిశీలించిన ఎన్సీబీ అధికారులు తను బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు బయటపడింది.

దీంతో అధికారులు ఆమెను విచారణకు పిలిచారు.

 Another Sensation In Bollywood Along With Aryan Khan Case Is He The Next Target Of Ncb-ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ గాడ్ ఫాదర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో భాగంగా బాలీవుడ్ గాడ్ ఫాదర్ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

ఎన్సీబీ అధికారుల నెక్స్ట్ టార్గెట్ కరణ్ జోహార్ లక్ష్యంగా మారనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన ఒక వీడియో రెండు సంవత్సరాల క్రితం వైరల్ కాగా అధికారులు ఇప్పటి వరకు ఈ వీడియో గురించి పూర్తి విచారణ చేపట్టలేదు.

ఈ క్రమంలోనే ఆ పార్టీలో పాల్గొన్నటువంటి అందరి పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కరణ్ జోహార్ ఇంటిలో జరిగినటువంటి పార్టీలో పాల్గొన్న పలువురు సెలబ్రిటీల పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారిని విచారణ చేపడుతున్నారు.ఈ క్రమంలోనే కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన పార్టీలో పాల్గొన్న పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్ సేవించారని ఆరోపణలు రావడంతో అధికారులు ఈ పార్టీలో పాల్గొన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.ఇకపోతే కరణ్ జోహార్ ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎన్సీబీ అధికారులు ఆ వీడియోను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అందులో ఏ విధమైనటువంటి మత్తు పదార్థాలు సేవించినట్లు ఆధారాలు లభించలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ ఈ వీడియో పై విచారణ పూర్తి కాలేదని, ఈ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలను అరెస్టు చేసిన ఎన్సీబీ రీజనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే పదవిని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

దీంతో కరణ్ జోహార్ మరికొన్ని చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

#BollywoodAryan #Drugs #God Father #Aryan Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube