దర్శకుడి కొడుకుతో పెళ్లిపీటలెక్కనున్న స్వీటీ బేబీ...  

Another Rumors About Tollywood Actress Anushka Marriage News - Telugu Anushka, Anushka Latest Marriage News, Anushka Marriage News, Anushka Marriage Update, Anushka Marry Director Son, Anushka News, Tollywood Actress Anushka

గత కొద్దికాలంగా టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి గురించి పలు కథనాలు బాగానే వైరల్ అవుతున్నాయి.ఇందులో ఇప్పటికే అనుష్క భారత్ క్రికెట్ జట్టుకు చెందినటువంటి ఓ ప్రముఖ క్రికెటర్ తో ప్రేమాయణం నడుపుతోందని అంతేగాక అతడినే పెళ్లి పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా పలు రకాల వార్తలు గతంలో బలంగా వినిపించాయి.

Another Rumors About Tollywood Actress Anushka Marriage News

అయితే ఈ మధ్య కాలంలో అనుష్క పెళ్లి గురించి మరో వార్త నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఇందులో భాగంగా టాలీవుడ్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి ఓ దర్శకుడి కొడుకుతో తొందర్లోనే అనుష్క పెళ్లి పీటలు ఎక్కనుందను టాలీవుడ్ సినీ వర్గాలు బలంగా గుసగుసలాడుకుంటున్నాయి.

అయితే అనుష్క కూడా ఈ దర్శకుడితో పలు చిత్రాలను చేసిందని కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కలవడంతో దర్శకుడు కూడా అనుష్క తన కోడలుగా చేసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు.

ఒకవేళ టాలీవుడ్ కి చెందిన దర్శకుల కొడుకుల్లో అనుష్క శెట్టి కి సరిపోయే వారసులు ఎవరూ దాదాపుగా లేరు.దీంతో మరి ఎవరై ఉంటారా అని అనుష్క అభిమానులు తల పట్టుకుంటున్నారు.

మరి కొందరైతే ఈ వార్తలను ఇవన్నీ అవాస్తవాలని కొట్టి పారేస్తున్నారు.

ప్రస్తుతం అనుష్క ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి “నిశ్శబ్దం” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో సీనియర్ నటుడు మాధవన్, శాలిని పాండే, తెలుగు భామ అంజలి, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవిటి సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నటువంటి  ఓ యువతి పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రం ఏప్రిల్ 2వ తారీఖున విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటన కూడా చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Another Rumors About Tollywood Actress Anushka Marriage News Related Telugu News,Photos/Pics,Images..

footer-test