గులాబీ దళంలో మరో రచ్చ

అందరూ ఊహించిందే నిజమౌతోంది.గులాబీ దళంలో చిచ్చురేగింది… మంత్రి సబిత వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రూపంలో తాజాగా మరో రచ్చ మొదలైంది.మంత్రి కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కృష్ణారెడ్డి ఫైరవగా… అందుకు ధీటుగా మంత్రి సబిత స్ట్రాంగ్ కౌంటర్ తో జవాబిచ్చారు.అయితే… ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ రచ్చ మరింత తారాస్థాయికి చేరే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 Another Riot In The Pink Army , Minister Sabitha Indra Reddy, Mayor Parijata Narsimhareddy, Trs, Former Mla Thigala Krishna Reddy-TeluguStop.com

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె మంత్రిగా ఉంటూ స్థానికంగా తనకు దగ్గరగా ఉన్న నాయకులు కబ్జాలకు పాల్పడినా పట్టించుకోకుండా వారిని ప్రోత్సహిస్తు్న్నారన్నారని ఆరోపించారు.

మంత్రి సబిత మీర్‌పేటను నాశనం చేస్తున్నారని… చెరువులు, స్కూళ్ల స్థలాలను కూడా వదలడం లేదన్నారు.చెరువుల్లో కూడా శిలాఫలకాలు పాతుతున్నారని ఆరోపించారు.అది దేనికి సంకేతమో చెప్పాలని ప్రశ్నించారు.నియోజకవర్గంలో మంత్రి సబిత వ్యవహారశైలి, అవినీతికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్కు అందిస్తానన్నారు.

 Another Riot In The Pink Army , Minister Sabitha Indra Reddy, Mayor Parijata Narsimhareddy, TRS, Former MLA Thigala Krishna Reddy-గులాబీ దళంలో మరో రచ్చ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాదని తీగల ఫైర్ అయ్యారు.ఆమె కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చారని గుర్తుచేశారు.స్థానిక మంత్రాలయ చెరువు దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని తీగల వ్యతిరేకించారు.అవసరమైతే చెరువుల పరిరక్షణ కోసం తాను ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు.

తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.ఇదో పెద్ద విషయం కాదంటూ చాలా తేలికగా కొట్టిపారేశారు.తీగల కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించారంటూ కౌంటర్ ఇచ్చారు.నిజంగా కబ్జాలు చేసి ఉంటే కేసీఆర్‌ తనపై చర్యలు తీసుకుంటారన్నారు.

ప్రభుత్వం ఇలాంటివి ప్రోత్సహించదన్నారు.తీగల ఇలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదని.

కలసి మాట్లాడుకుంటామని తెలిపారు.

Telugu Riot, Mlathigala, Mayorparijata, Sabithaindra-Latest News - Telugu

అయితే,.ఇటీవల బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహరెడ్డి కాంగ్రెస్ లో చేరారు.ఆమె పార్టీ మారేందుకు కారణం మంత్రి సబిత తీరే అనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఆ వెంటనే తీగల కృష్ణారెడ్డి ఆమెను టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తీగల పార్టీ మారేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఓ వైపు జోరుగా ప్రచారం జరుగుతుండగా… మరోవైపు అటువంటి ప్రచారాలన్నీ అవాస్తవాలని తీగల కొట్టిపారేశారు.

టీఆర్ఎస్ లోనే ఉంటా… కేసీఆర్ వెంటే నడుస్తానంటూ అంటూ క్లారిటీ ఇచ్చారు.తనపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube