రోహిత్ శర్మ ఖాతాలో మరొక రికార్డు నమోదు..!

టీమిండియా సీనియర్ ఆటగాడు, అద్భుతమైన బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ వరుస రికార్డులతో భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.దాదాపు తాను ఆడిన అన్ని మ్యాచ్ లలో మంచి స్కోర్ చేస్తూ స్ట్రాంగ్ ప్లేయర్ గా తనని తాను ఎప్పటికప్పుడు నిరూపించుకున్నాడు.

 Another Record In Rohit Sharma's Account Rohit Sharma, Latest News,new Record, S-TeluguStop.com

ప్రస్తుతం కొనసాగుతున్న టీ-20 ప్రపంచ కప్ లో కూడా అతను చాలా పరుగులు చేశారు.ఈ నేపథ్యంలోనే ఒక సంచలన రికార్డు తన పేరిట రాసుకున్నారు.

అదేంటంటే టీ20లలో రోహిత్ శర్మ మూడు వేల పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా సంచలనం సృష్టించాడు.ఇప్పటి వరకు టీ20లో మూడు వేల పరుగులు చేసిన ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు.

తాజాగా ఆ జాబితాలో రోహిత్ శర్మ చేరుకున్నాడు.ఇప్పుడు అతను టీ-20లో 3000 పరుగులు చేసిన మూడవ క్రికెటర్ గా నిలిచాడు.

విశేషమేంటంటే.రోహిత్ శర్మ ఆడింది కేవలం 108 మ్యాచ్ లే.అయినప్పటికీ ప్రతి మ్యాచ్ లో సగటున 30 పరుగులు సాధించి వావ్ అనిపించారు.నిన్న విశ్వ వేదికగా నమీబియా, టీమ్ ఇండియా జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా రోహిత్ శర్మ 37 బంతుల్లో 56 పరుగులు చేశాడు.ఈ పరుగులతో అతను మూడు వేల పరుగులు సాధించిన బ్యాట్స్ మన్ గా రికార్డు నెలకొల్పాడు.

Telugu Kohli, Latest, Rohit Sharma, Cup-Latest News - Telugu

టీ20 క్రికెట్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన వారిలో ఇంకొక ఇండియన్ క్రికెటర్ కూడా ఉన్నాడు.అతడే విరాట్ కోహ్లీ.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ వెలుగొందుతున్నాడు.3227 పరుగులతో నంబర్ వన్ స్థానంలో విరాట్ కోహ్లీ నిలవగా.న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్(3115) తర్వాతి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.తాజాగా రోహిత్ శర్మ మూడవ స్థానాన్ని చేరుకున్నాడు.ఇంకో విశేషం ఏంటంటే టీ20లలో 4 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ ఒక్కరే.అంతేకాదు రోహిత్ శర్మ తన టీ20 కెరీర్ మొత్తంలో ఏకంగా 23 హాఫ్ సెంచరీలు సాధించి ఆశ్చర్యపరిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube