మన యూసఫ్ అలీ కి మరో అరుదైన గౌరవం...ఈ సారి ఏకంగా....

దేశం కాని దేశం వెళ్లి అక్కడ కష్టపడి పనిచేస్తూ ,అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ దేశాధి నేతలచే శహభాష్ అనిపించుకోవడం మాములు విషయం కాదు.అంతేనా అదే దేశంలో కీలక వ్యవస్థకు అత్యంత కీలక భాద్యతలు చేపట్టడం, స్వయంగా మీరే ఉండాలంటూ ఆ దేశాది నేతలే ఆహ్వానం అందించం గొప్ప విషయం.

 Another Rare Honor For Our Yusuf Ali This Time Together , Vice Chairman Of The B-TeluguStop.com

అబుదాబి లో ఓ సామాన్య వ్యాపార వేత్తగా జీవితం మొదలు పెట్టి ఇప్పుడు ఏకంగా అబుదాబి వ్యాపార బోర్డ్ వైస్ ఛైర్మెన్ స్థాయికి ఎదిగాడు ఈ భారతీయుడు.

యూసఫ్ అలీ.

అబుదాబి లో ఈ పేరుతెలియని వాళ్ళు ఉండరు.ఓ సామాన్య వ్యాపారస్తుడిగా జీవితం మొదలు పెట్టిన అలీ.అంచెలంచెలుగా ఎదుగుతూ అబుదాబి లో ఉండే ప్రవాస భారతీయులలో అత్యధిక ధనవంతుడుగా ఘనత దక్కించుకున్నారు.ఎన్నో సేవా కార్యక్రమాలు, తమ సొంత రాష్ట్రం కేరళలో చేపట్టిన అభివృద్ధి పనులును గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డు తో సత్కరించుకుంది.

ఎన్నో దేశాలలో పలు రకాల కంపెనీలు నిర్వహిస్తున్న యూసఫ్ అలీ, అబుదాబి లో సంపన్నుడిగా గుర్తింపు సంపాదించారు.అక్కడి ప్రభుత్వానికి విరివిగా విరాళాలు అందిస్తూ తన వంతు సాయం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఆయన సేవలను గుర్తించిన అబుదాబు ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ ఇచ్చి గౌరవించుకుంది.

Telugu Rareyusuf, Indians, Kerala, Prince Crown, Chairman Board, Yusuf Ali-Telug

అయితే ఈ గౌరవం చాలదు అనుకున్నారో ఏమో కాని ఈ సారి భారతీయులు అందరూ గౌరవించే విధంగా అబుదాబి వ్యాపార బోర్డ్ వైస్ ఛైర్మెన్ గా నియమించబడ్డారు.కౌన్ ప్రిన్స్ ఈ నియామకాన్ని అలీ కి అందజేశారు.ఇదిలాఉంటే ఈ సంస్థ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థ అబుదాబిలో జరిగే వ్యాపార కార్యకలాపాలు అన్నీ ఈ సంస్థ పర్యవేక్షలోనే జరుగుతాయి.

ఈ క్రమంలో యూసఫ్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం తనను వైస్ చైర్మన్ గా నియమించడాన్ని ఎంతో సంతోషంగా ఉందని ప్రిన్స్ క్రౌన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube