తెలంగాణలో తెరమీదకి మరొక పార్టీ   Another Political Party Started In Telangana     2017-11-12   20:57:25  IST  Bhanu C

తెలంగాణా రాష్ట్ర సాధనకై ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ..కేసీఆర్ తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి ఎంత కృషి చేశాడు అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉద్యమ ఫలితంగా ప్రత్యేక తెలంగాణా వచ్చేసింది. ఈ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఎంత కీలకమో..తెలంగాణా జాక్ ప్రెసిడెంట్ కోదండరాం కూడా అంతే కీలకం. అయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాకా కేసీఆర్ కి కోదండరాంకి ఇద్దరిమధ్య దూరం ఏర్పడింది అనేవిషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ కి చెమటలు పట్టిస్తున్నాయి.

తెలంగాణలో మరొక ఉద్యమ పార్టీ పురుడుపోసుకోబోతుంది..ఇది నిజమా అంటే నిజమనే చెప్తున్నారు విశ్లేషకులు..కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన జేఎసి ఇప్పుడు వేస్తున్న అడుగులు కొత్త పార్టీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి..అంతేకాదు తమతో కలిసివచ్చే పార్టీలతో కలిసి ఎంతో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నారు.

అమరవీరుల యాత్ర పేరుతో చాపకింద నీరులా తెలంగాణాలో రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతున్న ప్రొఫెసర్ కోదండరాం ఈ నెల 30న కొలువుల కోట్లాట స‌భ‌కు సిద్ధ‌మౌతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ నిర్వ‌హ‌ణ‌కు కావాల్సిన అనుమ‌తుల‌పై అనుమానాలు వ్య‌క్త‌మౌతున్న సమయంలో..కోర్టు ఆదేశాల ప్ర‌కార‌మే స‌భ జ‌రుపుతామ‌ని కోదండ‌రామ్ చెప్పుకొస్తున్నారు

టి-జేఎసి రాజకీయ పార్టీగా మారుతుంది అని ఎప్పటినుంచో ఊహాగానాలు ఉన్నాయి..కానీ ఈ విషయంలో కోదండరాం నుంచీ ఎటువంటి స్పందన రాలేదు…కానీ త్వ‌ర‌లోనే ఈ విషయంలో ఒక నిర్ణ‌యం ప్రకటించేలా కనిపిస్తోంది. అయితే జాక్ శ్రేణులు మాత్రం రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వెళ్ళాలి అని ఒత్తిడి కూడా చేస్తున్నాయి. జ‌కీయ పార్టీ ఏర్పాటు చేయాల‌నే ఒత్తిడి జేఏసీ శ్రేణుల నుంచీ తీవ్రంగానే ఒత్తిడి ఉంది. దీనికి అనుగుణంగా త్వ‌ర‌లోనే ఆయ‌న నిర్ణ‌యం ఉంటుంద‌ని జేఏసీ వ‌ర్గాలు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నాయి…మరి కోదండరాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఆసక్తిగా ఉన్నారు. మరి కోదండరాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.