టీఆర్ఎస్‌లో మ‌రో పొలిటిక‌ల్ వార‌సుడు ఎంట్రీ..!

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీదే ఫుల్ హ‌వా కొన‌సాగుతోంది.సీఎంగా కేసీఆర్, ఆయ‌న కేబినెట్‌లో మంత్రులుగా మేన‌ళ్లుడు హ‌రీష్‌రావు, కొడుకు కేటీఆర్ ఉన్నారు.

 Another Political Heir Entry In Trs ..!-TeluguStop.com

వీరంతా రాష్ట్రాన్ని ఏలేస్తుంటే కేసీఆర్ కుమార్తె, క‌ల్వ‌కుంట్ల క‌విత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.కేసీఆర్‌కు ద‌గ్గ‌ర బంధువు అయిన వినోద్‌కుమార్ క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్నారు.

ఇలా టోట‌ల్‌గా తెలంగాణ అంతా కేసీఆర్ ఫ్యామిలీ హ‌వానే ప్ర‌స్తుతం న‌డుస్తోంది.ఇటీవ‌ల విప‌క్షాలు సైతం దీనిని బేస్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించాయి.

ఇటీవ‌ల కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన‌ప్పుడు కూడా విప‌క్షాలు కేసీఆర్ ఫ్యామిలీ స‌భ్యుల కోస‌మే ఒక్కొక్క‌రికి ఒక్కో జిల్లా ఏర్పాటు చేశార‌ని కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.క‌విత‌కు నిజామాబాద్ – హ‌రీష్‌కు సిద్ధిపేట – కేసీఆర్‌కు మెద‌క్ – కేటీఆర్‌కు సిరిసిల్ల జిల్లాలు ఏర్పాటు చేశార‌ని తెలంగాణ విప‌క్షాలు ఆరోపించాయి.

ఇదిలా ఉంటే తెలంగాణ పాలిటిక్స్‌లో బ్రేకుల్లేకుండా దూసుకుపోతోన్న కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మ‌రో పొలిటిక‌ల్ వార‌సుడు ఎంట్రీ ఇచ్చేందుకు స్కెచ్ రెడీ అవుతోంది.కేసీఆర్ తోడల్లుడు కుమారుడు, ప్రస్తుతం టీ న్యూస్ ఎండీ సంతోష్ త్వరలోనే క్రీయాశీల రాజకీయాల్లోకి రావొచ్చన్న టాక్ తెలంగాణ భ‌వ‌న్‌లో వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం టీ న్యూస్ మీడియా అధికార టీఆర్ఎస్‌కు కీల‌కంగా మారింది.ఆ మీడియా బాధ్య‌త‌ల‌న్ని సంతోష్ చూస్తున్నారు.

తాజాగా ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో అధికార పార్టీ నేత‌లు నానా హంగామా చేశారు.ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఎక్క‌డిక‌క్క‌డ సంతోష్ ఫ్లెక్సీలు వెలిశాయి.

ఇవ‌న్నీ చూసిన టీఆర్ఎస్ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంతోష్ పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని చ‌ర్చించుకుంటున్నారు.ఇందుకు కేసీఆర్ కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

సో సంతోష్ కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేస్తే కేసీఆర్ ఫ్యామిలీలో మ‌రో పొలిటిక‌ల్ లీడ‌ర్ యాడ్ అయిన‌ట్టే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube