టీడీపీ తో మరో పార్టీ పొత్తు ! ఊహించిందేగా 

ఇప్పటికే ఏపీలో జనసేన పార్టీ( Jana Sena Party )తో టీడీపీ పొత్తు పెట్టుకుంది.

బీజేపీనీ తమతో కలుపుకు వెళ్లాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా,  ఆ పార్టీ మాత్రం టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు.

ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో టిడిపి అదినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో పాటు,  ఫైబర్ గ్రిడ్ స్కాం లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం అరెస్టు అయ్యే అవకాశాలు ఉండడంతో,  బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి( TDP ) తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండదనే విషయం క్లారిటీ వచ్చేసింది.ఎప్పటి నుంచో వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,  టిడిపి తో పొత్తుకు ప్రయత్నిస్తున్న సిపిఐ , వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీతో కలిసి నడిచేందుకు తాము సిద్దమని ప్రకటించింది.

 ఈ మేరకు సిబిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ( CPI ramakrishna ) ఈ పొత్తు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు .ఈ మేరకు ఓ మీడియా ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న రామకృష్ణ దీనిపై స్పందించారు. టిడిపితో జత కడతాం .టిడిపితో కలిసి పనిచేస్తాం.ప్రజా సమస్యలపై టీడీపీతో కలిసి పోరాటం చేస్తాం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అంటూ రామకృష్ణ వ్యాఖ్యానించారు.

ఇక టిడిపితో సిపిఐ పొత్తు పెట్టుకునేందుకు కొన్ని షరతులను విధించారు.బిజెపిని దూరం పెడితే మేము కూడా టిడిపి తో కలిసి పని చేస్తాం జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకుండా చేయడమే మా లక్ష్యం.

Advertisement

  ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీతో జతకట్టే ప్రసక్తే లేదు అని  సిపిఐ సీనియర్ నేత గపూర్ వ్యాఖ్యానించారు.

 ఇప్పటికే చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) ను సిపిఐ ఖండించింది .చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తప్పుపట్టారు.అనేక జిల్లాల్లో టిడిపి తో కలిసి సిపిఐ నేతలు రోడ్లపై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు