మొన్న ఆఫీస్‌, నేడు ఇల్లు.. కంగ‌నాకు షాకిచ్చిన ముంబై అధికారులు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌.ఏ విష‌యంలో అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

 Another Notice To Kangana Ranaut From Bmc! Notice, Kangana Ranaut, Bmc, Latest N-TeluguStop.com

ఇక ఇటీవ‌ల బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసులో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రేను టార్గెట్‌ చేసింది.సీన్ క‌ట్ చేస్తే కంగ‌నా ర‌నౌత్ వ‌ర్సెస్ మహారాష్ట్ర ప్ర‌భుత్వం గా మారింది.

ఈ క్ర‌మంలోనే గ‌త కొన్ని రోజులుగా కంగ‌నా, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
అయితే ఇదే స‌మ‌యంలో బీఎంసీ అధికారులు ముంబయిలోని కంగనా రనౌత్‌కు చెందిన ఆఫీస్‌లోని కొంత భాగాన్ని బుధవారం కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే.

భవనంలో అక్రమ మార్పులు చేశారని.అందుకే దీన్ని కూల్చివేస్తున్నామని మున్సిపల్ అధికారులు స్ప‌ష్టం చేశారు.దీంతో కంగనా రనౌత్‌ తన కార్యాలయం కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించ‌గా.కూల్చివేతపై కోర్టు స్టే విధించింది.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది రోజుల‌కే.కంగ‌నా ర‌నౌత్‌ నివాసం కూడా అక్రమ కట్టడమేనంటూ తాజాగా నోటీసులు ఇవ్వ‌డం గ‌మనార్హం.ప్ర‌స్తుతం ఖర్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో కంగనా ర‌నైత్‌ ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నారు.అదే భవనంలో ఆమెకు మూడు ఫ్లాట్స్ కూడా ఉన్నాయి.

అయితే తాజాగా ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలేనని .బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) కంగ‌నాకు నోటీసులు జారీ చేసి షాకిచ్చారు.

అంతేకాదు, ఆమె కార్యాల‌యం కంటే ఇంటి నిర్మాణంలోనే అధికంగా అక్రమ కట్ట‌డాలు ఉన్నాయ‌ని బీఎంసీ అధికారులు అంటున్నారు.ఈ క్ర‌మంలోనే త‌మ ‌నోటీసులకు సమాధానం ఇవ్వాలని అధికారులు కంగ‌నాను కోరడం హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రోవైపు అక్రమ నిర్మాణం సాకుతో త‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని.నిన్న కంగనా రనౌత్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిసిన సంగ‌తి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube