వామ్మో.. బ్రెజిల్ లో మరో కొత్త స్ట్రెయిన్‌ వైరస్ !

గత సంవత్సర కాలం నుంచి ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వ్యాపించడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.లక్షల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు.

 New Strain Virus Found In Brazil, Brazil, New Strain Virus, Who, Scientists, Soc-TeluguStop.com

ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనడంతో ఊపిరిపీల్చుకున్న ప్రపంచానికి మరొక భయంకరమైన వైరస్ గురించి తెలియజేస్తున్నారు.తాజాగా బ్రిటన్ లో కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుని బ్రిటన్ దేశంలో వేగంగా వ్యాప్తి చేయడమే కాకుండా ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ కూడా వ్యాప్తి చెందుతుంది.

నెల కిందట కనుగొన్న స్ట్రెయిన్‌ వైరస్ ఇప్పటికి దాదాపు 10 రూపాలుగా రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
ఈ కొత్త గా రూపాంతరం చెందుతున్న స్ట్రెయిన్‌ వైరస్ ను ప్రస్తుతమున్న వ్యాక్సిన్ లను ఉపయోగించే కట్టడి చేయడానికి సాధ్యం కాదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాలలో ఉన్న స్ట్రెయిన్‌ వైరస్ తో పోలిస్తే బ్రెజిల్ దేశంలో వ్యాపించి ఉన్న స్ట్రెయిన్‌ వైరస్ లో అనేక జన్యు మార్పులు చోటు చేసుకున్నాయని వారు తెలిపారు.అయితే  ‘నెక్ట్స్‌ స్ట్రెయిన్‌’వైరస్ జపాన్ లో మాత్రమే ఈ బ్రెజిల్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఈ వైరస్ ఇప్పటివరకు భారత్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.

Telugu Brazil, Carona, Masks, Strain, Strain Brazil, Distance, Africa, Strainvir

ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బ్రిటన్ వంటి దేశాలలో గుర్తించిన కొత్తరకం ‘స్ట్రెయిన్‌’వైరస్ ప్రభావం గురించి ఇంకా అంచనా వేయాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ చీఫ్ డాక్టర్ మైకేల్ రియాన్ ఈ సందర్భంగా తెలిపారు.అయితే ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, తరచూ చేతులు శుభ్రం చేస్తూ, బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా కొత్త వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube