తెలంగాణలో రానున్న మరో కొత్త పథకం ఇదే

మొదటి దఫా పాలన నుండి ప్రస్తుత రెండో దఫా పాలన వరకు తెలంగాణ ప్రభుత్వం పలు ప్రజారంజక పథకాలతో ముందుకెళ్తోంది.కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఇంకా మరెన్నో పథకాలు ప్రజలలో కేసీఆర్ కు మంచి పేరును తీసుకొచ్చాయి.

 Another New Scheme Telangana Govt-TeluguStop.com

కేసీఆర్ ను మరల అధికారంలోకి తీసుకురావడంలో ఈ పథకాల పాత్ర ఎంతో కీలకమైనదిగా చెప్పవచ్చు.ఇలా పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్ ప్రభుత్వం మరొక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టాలనే యోచిస్తోంది.

మహిళల ఉపాధి కల్పించడానికి చేపలు, చేపల వంటకాలను విక్రయించుకోవడానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను పంపిణీ చేయనుంది.నేరుగా వినియోగదారుడి వద్దకే ఫిష్ ఔట్ లెట్ వాహనాలు చేరడం ద్వారా మహిళలకు ఉపాధి కలుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

 Another New Scheme Telangana Govt-తెలంగాణలో రానున్న మరో కొత్త పథకం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రంగంలో ఆసక్తి ఉన్న మహిళలకు ఫిష్ ఔట్ లెట్ వాహనాలను మంజూరు చేసి మహిళలకు శాశ్వత ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.మరి ఈ పథకం పనితీరు వివరాలను త్వరలో ప్రభుత్వం వివరించనుంది.

మహిళలకు సంబంధించిన పథకం కాబట్టి మహిళా సంఘాల ద్వారా ఈ పథకాన్ని ప్రవేశపెడుతుందా లేదా ఏదైనా వేరే ప్రణాళిక ఉందా అనేది చూడాల్సి ఉంది.

#@CM_KCR #@JaiKCR29 #Fish Outlet #KCRIntroduce #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు