అనంత విశ్వంలో మరో కొత్త గ్రహం..?!

ఈ అనంత విశ్వంలో మన కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి.నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం ఇలా అన్నీ కూడా మనకు సరికొత్త అనుభూతిని ఇస్తూ ఉంటాయి.

 Another New Planet In The Infinite Universe Universe, New Planet, Banglore Scien-TeluguStop.com

అసలు మన విశ్వంలో ఏమి ఉంది అనే ప్రశ్న అందరిలోను వస్తూనే ఉంటుంది.అంతరిక్షం అంటేనే అంతుచిక్కని ప్రశ్నలు.

ఈ క్రమంలోనే మన భారత ఖగోళ శాస్త్రవేత్తలు ఒక సరికొత్త గ్రహాన్ని కనుగొన్నారు.ఈ గ్రహం మన విశ్వంలో ఉన్న ఒక నక్షత్రం చుట్టూ అత్యంత సమీపం నుంచి తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఈ గ్రహానికి సంబందించిన వివరాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక ప్రకటనలో తెలిపారు.మరి ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా.అహ్మదాబాద్‌ లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (పీఆర్‌ఎల్‌) పరిశోధక బృందం ‘పీఆర్‌ఎల్‌ అడ్వాన్స్‌డ్‌ రేడియల్‌ వెలాసిటీ అబు-స్కై సెర్చ్‌ అనే ఒక సాంకేతికత సాయంతో సౌర కుటుంబంలో గల హెచ్‌డీ 82139బి అనే నూతన గ్రహాన్ని గుర్తించింది.ఆ గ్రహం భూమికి దాదాపు 725 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ముసలి నక్షత్రం అయిన హెచ్‌డీ 82139 చుట్టూ పరిభ్రమిస్తోంది అని తెలిపారు.

Telugu Isro, Latest, Planet, Universe-Latest News - Telugu

అలాగే ఆ నక్షత్ర ద్రవ్యరాశి సూర్యుడితో పోలిస్తే 1.5 రెట్లుగా ఉంది.అంటే కొత్తగా గుర్తించిన గ్రహం యొక్క ద్రవ్యరాశి గురుగ్రహం ద్రవ్యరాశిలో 70% గా ఉంది.అంటే నక్షత్రం చుట్టూ 0.05 ఆస్ట్రానమికల్‌ యూనిట్ల దూరంలోనే ఈ నూతన హెచ్‌డీ 82139బి తిరుగుతోంది.నక్షత్రం చుట్టూ ఈ నూతన గ్రహం ఒక్క పరిభ్రమణాన్ని పూర్తిచేసేందుకు కేవలం 3.2 రోజుల సమయం మాత్రమే పడుతోంది.ఈ గ్రహం నక్షత్రానికి దగ్గరగా ఉండటంతో దాని ఉపరితల ఉష్ణోగ్రత 2 వేల కెల్విన్‌ల వరకు ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube