బెంగుళూర్ కు మరో కొత్త పేరు..?!

బెంగళూరు పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది ఐటి హబ్, కంపెనీల వాతావరణం.సాధారణంగా చాలా మంది ఉద్యోగాల కోసం బెంగళూరును ఎంచుకుంటూ ఉంటారు.అక్కడి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.అందుకే చాలా మంది అక్కడ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతారు.అంతేకాకుండా మన దేశంలో ఎక్కువ కంపెనీలు ఉన్న సిటీల్లో బెంగళూరు కూడా ఉంది.కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకు కొత్త పేరు పెట్టేందుకు మహేంద్ర సంస్థ చైర్మన్‌ ఆనంద్‌ మహేంద్ర పోటీని నిర్వహించారు.

 Another New Name For Bangalore ..?! One, More,  Tech, Halli, Bengaluru, Bengalur-TeluguStop.com

ఈ పోటీల్లో చాలా మంది నెటిజన్లు పాల్గొన్నారు.ఎన్నో పేర్లను బెంగళూరుకు సూచించారు.

అయితే ఈ పోటీకి ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులలో ఒకరైన నందన్‌నీలేకణి న్యాయనిర్ణేతగా ఉన్నారు.ఈ కాంపిటేషన్ లో బెంగళూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి టెక్‌హళ్లిగా బెంగళూరుకు పేరును సూచించారు.

ఇందుకు ఆనంద్‌ మహేంద్రతోపాటు నందన్‌ నీలేకణి సంతోషం వ్యక్తం చేశారు.టెక్‌హళ్లి అనే పదంలో టీఈసీ తర్వాత హెచ్‌ను కేపిటల్‌ లెటర్‌గా ఉపయోగించారు.

దీంతో ఒకే అక్షరం రెండు పదాలకు అర్థం వచ్చేలా ఉండటం అందరినీ ఆకర్శించింది.విజేత పినిన్‌ఫరీనా హెచ్‌ 2 స్పీడ్‌ కారును స్వీకరించేందుకు అడ్రస్ వివరాలు పంపించాలని ఆనంద్‌ మహేంద్ర ట్విట్టర్‌ ద్వారా ఆయన్ను కోరారు.

బెంగళూరును గ్రీన్ సిటీ అని అంటారు.ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది.ప్రస్తుతం వివిధ అభివృద్ధి కార్యక్రమాల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించారు.తద్వారా ఈ నగరంలో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది.

ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని సరస్సుల నగరం అని కూడా అంటారు.బెంగళూరు భారతదేశంలో సాఫ్ట్‌వేర్‌ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.

అందుకే దీనిని “సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా” అంటారు.ప్రస్తుతం బెంగుళూరులో కూడా కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube