వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..!

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్.వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది.

 Another New Future In Whatsapp Whatsapp, Business Account, Whatsapp Business, N-TeluguStop.com

నూతన సంవత్సరంలో తమ యూజర్లను ఆకట్టుకునేందుకు బిజినెస్ యూజర్ల కోసం అడ్వాన్స్‌డ్ సెర్చ్ అనే ఓ కొత్త ఫీచర్‌ ను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది.యూజర్లు సులభంగా తమ మెసేజ్‌లు సెర్చ్ చేసుకునేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడనుంది.

ఈ ఫీచర్‌తో యూజర్లు చాట్‌ బాక్స్‌ లో మూడు కొత్త ఫిల్టర్స్ ను పొందుతారు.అందులో మొదటిది అన్‌రీడ్, రెండవది కాంటాక్ట్స్, మూడవది నాన్ కాంటాక్ట్స్.

వాట్సాప్ లోని ఈ మూడు కొత్త ఫిల్టర్ల పై క్లిక్ చేయడం ద్వారా యూజర్లు తమ మెసేజ్‌లను సెర్చ్ చేసుకోవచ్చు.ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఈ కొత్త ఫీచర్‌ ను వినియోగించుకోవచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది.

Telugu Advanced Search, Whatsapp-Latest News - Telugu

వాట్సాప్ బిజినెస్ అకౌంట్ లో ఈ ఫీచర్ ను Enable చేసుకోగానే యూజర్లకు సెర్చ్ ఫిల్టర్ బాక్సులో అన్ రీడ్, కాంటాక్ట్స్, నాన్-కాంటాక్ట్స్ ఆప్షన్లు కనిపిస్తాయి.ఈ ఆప్షన్ల ద్వారా మీ చాట్ బాక్సులోని ఫొటోలు, వీడియోలు, లింకులు, ఆడియోలు, డాక్యుమెంట్లను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు.ఒకవేళ యూజర్లు నాన్-కాంటాక్ట్స్ యొక్క మెసేజ్‌ లను చదవాలనుకుంటే, వాట్సాప్ లోని సెర్చ్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో నాన్ కాంటాక్ట్స్ అనే ఫిల్టర్ పై ట్యాప్ చేస్తే సరిపోతుంది.వాట్సాప్‌లోని ఈ కొత్త ఫీచర్ల ద్వారా యూజర్లు తమ చాట్ ను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube