వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..!

Another New Future In Whatsapp

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్.వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది.

 Another New Future In Whatsapp-TeluguStop.com

నూతన సంవత్సరంలో తమ యూజర్లను ఆకట్టుకునేందుకు బిజినెస్ యూజర్ల కోసం అడ్వాన్స్‌డ్ సెర్చ్ అనే ఓ కొత్త ఫీచర్‌ ను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది.యూజర్లు సులభంగా తమ మెసేజ్‌లు సెర్చ్ చేసుకునేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడనుంది.

ఈ ఫీచర్‌తో యూజర్లు చాట్‌ బాక్స్‌ లో మూడు కొత్త ఫిల్టర్స్ ను పొందుతారు.అందులో మొదటిది అన్‌రీడ్, రెండవది కాంటాక్ట్స్, మూడవది నాన్ కాంటాక్ట్స్.

 Another New Future In Whatsapp-వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాట్సాప్ లోని ఈ మూడు కొత్త ఫిల్టర్ల పై క్లిక్ చేయడం ద్వారా యూజర్లు తమ మెసేజ్‌లను సెర్చ్ చేసుకోవచ్చు.ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఈ కొత్త ఫీచర్‌ ను వినియోగించుకోవచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది.

వాట్సాప్ బిజినెస్ అకౌంట్ లో ఈ ఫీచర్ ను Enable చేసుకోగానే యూజర్లకు సెర్చ్ ఫిల్టర్ బాక్సులో అన్ రీడ్, కాంటాక్ట్స్, నాన్-కాంటాక్ట్స్ ఆప్షన్లు కనిపిస్తాయి.ఈ ఆప్షన్ల ద్వారా మీ చాట్ బాక్సులోని ఫొటోలు, వీడియోలు, లింకులు, ఆడియోలు, డాక్యుమెంట్లను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు.ఒకవేళ యూజర్లు నాన్-కాంటాక్ట్స్ యొక్క మెసేజ్‌ లను చదవాలనుకుంటే, వాట్సాప్ లోని సెర్చ్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో నాన్ కాంటాక్ట్స్ అనే ఫిల్టర్ పై ట్యాప్ చేస్తే సరిపోతుంది.వాట్సాప్లోని ఈ కొత్త ఫీచర్ల ద్వారా యూజర్లు తమ చాట్ ను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు

.

#Sapp #Advanced #Sapp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube