గూగుల్ మ్యాప్స్ లో మరో సరికొత్త ఫీచర్..!

ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక విషయంపై ఏదో ఒక అప్డేట్ ప్రతిరోజు మనకు కనిపిస్తూనే ఉంటుంది.అందులో ముఖ్యంగా టెక్నాలజీ పరంగా ఎన్నో అప్డేట్స్ ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం.

 Another New  Feature In Google Maps, Google Map,new Features, Google, Goggle Use-TeluguStop.com

మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్న సమయంలో తరచుగా ఉపయోగించే టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే అది గూగుల్ మ్యాప్స్.తాజాగా గూగుల్ మ్యాప్స్ సంబంధించి అప్డేట్ వచ్చింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.గూగుల్ మ్యాప్స్ కి సంబంధించి ప్రయాణికులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అలాగే నమ్మకమైన అనుభవాన్ని కల్పించే విధంగా కొత్త నిర్మాణం పై దృష్టి పెట్టింది గూగుల్.

తాజాగా గూగుల్ మ్యాప్స్ వినియోగదారుల కోసం గతంలో సందర్శించిన ప్రదేశాలను సులువుగా నావిగేట్ చేసుకోవడానికి కోసం త్వరలో గూగుల్ మ్యాప్స్ లో “గో ” ట్యాబ్ ఆప్షన్ ను తీసుక రాబోతోంది.ఈ ఫీచర్ ద్వారా మనం ప్రతి చోటకి వెళ్లి షాపింగ్ మాల్స్ ఇంకా ఇతర ప్రదేశాలను మనం చేసుకోవచ్చు కూడా.

ప్రతిరోజు మనం వెళ్లే దారిలో ఎంత వరకు ట్రాఫిక్ ఉందన్న విషయం, ఎక్కడికైనా చేరుకోవాలంటే ఇంకా ఎంత సమయం పడుతుంది అనే విషయాలను ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఖచ్చితమైన వివరాలను పొందవచ్చు.

Telugu Android, Goggle, Google, Google Map-Latest News - Telugu

కొత్త ఫీచర్ ను అతి త్వరలో ios, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి గూగుల్ తీసుకురాబోతోంది.ఇప్పటివరకు కేవలం గూగుల్ మ్యాప్స్ లో మనం మన ఇంటిని అలాగే పనిచేసే ప్రదేశాన్ని మాత్రమే సేవ్ చేసుకోవడానికి అనుమతి ఉండగా అతి త్వరలో మిగతా కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకు పోతుంది గూగుల్. వినియోగదారులు ఎప్పటికప్పుడు వివిధ ప్రదేశాలు కోసం వెతుక్కోకుండా ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

ఈ సౌకర్యాన్ని ప్రయాణం చేసే సమయంలో ఉపయోగిస్తే తొందరగా గమ్యాన్ని చేరుకుంటామని గూగుల్ తెలుపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube