గూగుల్ చాట్ లో మరో కొత్త ఫీచర్..!

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ డెవలప్ చేసిన అప్లికేషన్లు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి.నాలుగేళ్ల క్రితం విడుదల చేసిన ‘గూగుల్ చాట్’ అప్లికేషన్ ఇప్పటికే ఐదు మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో ఆండ్రాయిడ్ యాప్ మార్కెట్లో దూసుకెళ్తోంది.

 Another New Feature In Google Chat, Google, Chat, Google New Features, New Updat-TeluguStop.com

ప్రస్తుతం ఇంకా ఇంప్రూమెంట్ దశలోనే ఉన్న దీనికి మరిన్ని హంగులు జోడించడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది.ఇందులోని భాగంగా తాజాగా గూగుల్ చాట్‌లో ‘రిమైండ్‘ ఫీచర్‌ను ఆవిష్కరించింది.

ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు మెసేజ్ రీడింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.మెసేజ్ చదివారా? చదవలేదా? అనేది ఈ ఫీచర్ యూజర్లను ఎప్పుడూ అడుగుతూనే ఉంటుంది.ఒకవేళ మీరు ఏదైనా మెసేజ్ చదవడం మర్చిపోతే.మీరు ఆ మెసేజ్ లను చదవలేదని ఈ ఫీచర్ తెలియజేస్తుంది.

ఈ ఫీచర్ డెస్క్, మొబైల్‌లో కూడా నవంబర్ నెల నుంచి అందుబాటులోకి రానుంది.మేసేజ్ చదివారా లేదా అన్నది తెలుసుకోవడం ఇకపై సులభమవుతుందని గూగుల్ పేర్కొంటోంది.

మీరు బిజీ లో పడిపోయి ఏదైనా మెసేజ్ చదువుకుంటే ఈ ఫీచర్‌ దాన్ని మీకు గుర్తు చేస్తుంది.పాపప్ మెనూ ఆస్క్ నుంచి ‘మార్క్‌ యాజ్‌ అన్‌రెడ్‌‘ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే.

చదవని మెసేజ్‌లే ముందుగా కనిపిస్తాయి.ఫలితంగా యూజర్లు ఒక్క మెసేజ్‌ను కూడా మిస్ కారు.

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ను నవంబర్ లోగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ డెవలపర్లు వెల్లడించారు.

పటిష్టమైన సెక్యూరిటీ అప్డేట్స్ కూడా త్వరలోనే తీసుకొస్తామని గూగుల్ చెబుతోంది.

వినియోగదారులు సున్నితమైన సమాచారం షేర్ చేస్తున్న సమయంలో డేటా లీక్ కాకుండా ఉండేందుకు “ప్రివెంట్ డేటా లీక్స్” ఫీచర్ అభివృద్ధి చేస్తున్నారు.దీనివల్ల యూజర్ల సురక్షితంగా తమ డేటాని తమకు నచ్చిన వారితో షేర్ చేసుకోవచ్చు.

అయితే గూగుల్ చాట్ వాట్సాప్ లాగా పాపులర్ కాలేదు.ఇప్పటికీ యూజర్లు గూగుల్ చాట్ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

మరి ఇది ఇప్పుడు ఉపయోగమైన ఫీచర్లతో వినియోగదారుల మెప్పు పొందుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube