సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న మరో సినిమా.. ఏదంటే?

భారతదేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరగడంతో సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ ఎన్నో సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి.ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా జనవరి 7వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా వాయిదా పడింది.

 Tollywood,    Film Industry,  Sankranthi,  7 Days And 6 Nights , Sumanth Ashwin,-TeluguStop.com

అలాగే 14వ తేదీ విడుదల కావాల్సిన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కూడా వాయిదా పడింది.

ఈ విధంగా సంక్రాంతి రేసులో దిగిన చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదాలు ప్రకటిస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో దిగిన మరొక సినిమా కూడా వాయిదా పడింది.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో, వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై సుమంత్ అశ్విన్, రజనీకాంత్ కలిసి నిర్మించిన ‘7 డేస్ 6 నైట్స్‘ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుందని ప్రకటించారు.

సుమంత్ అశ్విన్, మెహర్ చావల్, రోహన్, కృతికా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేశారు.ఈ సందర్భంగా సినిమా విడుదల వాయిదాని ప్రకటిస్తూ త్వరలోనే తిరిగి ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube