ర‌ఘురామ‌కు మ‌రో ఝ‌ల‌క్‌.. కౌంట‌ర్‌కు రీ కౌంట‌ర్ ప‌డిందిగా

ఏపీ వైసీపీ ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం రోజుకో తీరుగా కొన‌సాగుతోంది.ఎటో ఎటో తిరిగి చివ‌ర‌కు తానే ఇబ్బందుల్లో ప‌డేదాకా వ‌చ్చింది ఆయ‌న వ్య‌వ‌హార శైలి.

 Another Look For Raghuram As A Counter To The Counter, Raghurama, Ap Politics ,-TeluguStop.com

జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టాల‌నుకుని చివ‌ర‌కు త‌న మీద‌కు తెచ్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.ఇప్ప‌టికే ర‌ఘురామ ఓ అడుగు ముందుకేసి మ‌రీ కోర్టులో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై, సీబీఐపై కేసులు వేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆయ‌న ప్ర‌య‌త్నంలో కొంత స‌క్సెస్ అయిన‌ట్టే క‌నిపించినా చివ‌ర‌కు ఆయ‌న‌కు ఝ‌ల‌క్‌లు త‌గులుతూనే ఉన్నాయి.ఇక ఆయ‌న వేసిన పిటిష‌న్ మేర‌కు సీబీఐ అధికారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కేంద్రం నోటీసులు కూడా ఇచ్చింది.

అయితే ఇక్క‌డే సీబీఐ అధికారులు ర‌ఘురామ‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు.త‌మ‌మీదే కోర్టులో పిటిష‌న్ వేయ‌డంతో కాస్త కోపంగానే ఉంటున్న సీబీఐ ప్ర‌తి విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఎక్క‌డి నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు రాకుండా కేవ‌లం తాము చ‌ట్టానికి లోబ‌డే ప‌నిచేస్తున్నామంటూ తెలుపుతున్నారు.ఇక ర‌ఘురామ రీసెంట్ గా జగన్ బెయిల్ రద్దు కోరుతూ వేసిన పిటిష‌న్‌పై సీబీఐ మెమో దాఖలు చేసింది.

ఆ విష‌యాన్ని కోర్టు విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేస్తున్నామంటూ తెల‌పింది.దీంతో రఘురామకు షాక్ తగిలినట్లయింది.

Telugu Ap, Cbi, Jagan, Raghurama, Ycp Rebel Mp-Telugu Political News

ఇక లాభం లేద‌ని మ‌రో విధంగా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ మ‌ళ్లీ పిటిషన్ వేశారు రఘురామ.ఇక ఈ సారి కూడా సీబీఐ మరోసారి ఝ‌ల‌క్ ఇచ్చింది.ఎంపీ విజయసాయి బెయిల్ రద్దు విష‌యాన్ని కూడా కోర్టు విచక్షణకే అప్ప‌గిస్తున్నామంటూ సీబీఐ అధికారులు ఇప్పుడు మ‌రో మెమో విడుద‌ల చేశారు.దీంతో ఇప్పుడు ర‌ఘురామ‌కు మ‌రో ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్ట‌యింది.

ఎందుకంటే కోర్టు ప‌రిధిలోకి వెళ్తే అది కాస్తా వెంట‌నే నిర్ణ‌యం వెలువ‌డ‌కుండా తాత్సారం జ‌రుగుతుంద‌ని ర‌ఘురామ చింత ప‌డుతున్నారంట‌.మొత్తానికి ర‌ఘురామ సీబీఐకి షాక్ ఇవ్వాల‌నుకుంటే చివ‌ర‌కు ఆయ‌న‌కే సీబీఐ వ‌రుస షాక్‌లు ఇస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube